Chiranjeevi | లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం పలికిన చిరంజీవి
Chiranjeevi | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan) - ఉపాసన (Upasana) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. లిటిల్ మెగా ప్రిన్సెస్ (Mega Littile Princess) కు చిరంజీవి (Chiranjeevi) స్వాగతం పలికారు.
Chiranjeevi | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan) – ఉపాసన (Upasana) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారి రాకతో చిరు కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది.
కాగా, లిటిల్ మెగా ప్రిన్సెస్ (Mega Littile Princess) కు చిరంజీవి (Chiranjeevi) స్వాగతం పలికారు. తనకు మనవరాలు పుట్టిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ‘లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం !! నీ రాక కోట్లాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపింది. ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Welcome Little Mega Princess !! ❤️❤️❤️
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023
మరోవైపు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ సహా ఇతర కుటుంబ సభ్యులంతా సోమవారం రాత్రి నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు. వారసురాలు పుట్టగానే వారంతా ఆనందంలో మునిగిపోయారు. అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్లారు. మరోవైపు తల్లిదండ్రులైన చరణ్ – ఉపాసన దంపతులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read..
Mega Princess | మెగస్టార్ చిరంజీవికి మనవరాలు.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జననం
Monsoon | సీమ నుంచి కదిలిన రుతుపవనాలు.. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

