Kona Venkat | టాలీవుడ్ సినీ రచయత నిర్మాత కోన వెంకట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువకుడిపై దాడి చేశారనే ఆరోపణలపై బాపట్ల జిల్లా కార్లపాలెం పోలీసులు కోన వెంకట్‌పై కేసు నమోదు చేశారు. గణపరానికి చెందిన ఎస్సీ నేత కత్తి రాజేష్.. తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి శనివారం టీడీపీలో చేరారు. ఈ క్రమంలో రాజేష్ తమ వద్ద రూ.8లక్షలు అప్పు తీసుకున్నాడని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం పోలీసులు రాజేష్‌ను పీఎస్‌కు తీసుకురాగా.. అక్కడే ఉన్న కోన వెంకట్ రాజేశ్‌పై చేయిచేసుకున్నారు. కులం పేరుతో దూషిస్తూ.. నిన్ను చంపితే అడిగే దిక్కెవరురా అంటూ దుర్బాషలాడారు. ఇక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని కోపంతో కోన వెంకట్, ఎస్సై తనపై దాడి చేశారని రాజేష్ ఆరోపించారు. అయితే రాజేష్ తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాజేష్ ఫిర్యాదుతో కోన వెంకట్ తో పాటు వైసీపీ నేతలు, ఎస్సై జనార్దన్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు పోలీసులు.