Adipurush writer | నాకేం తెలియదు, దర్శకుడు ఓం రౌత్‌ను అడగండి.. ‘ఆదిపురుష్’ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్
Adipurush writer | ఆదిపురుష్ సినిమాపై ఆది నుంచి వివాదాలే కొనసాగుతున్నాయి. సినిమా విడుదలైన తర్వాత విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. సినిమా కథ, క్యారెక్టర్లు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు.
ముంబై: ఆదిపురుష్ సినిమాపై ఆది నుంచి వివాదాలే కొనసాగుతున్నాయి. సినిమా విడుదలైన తర్వాత విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. సినిమా కథ, క్యారెక్టర్లు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. ప్రత్యేకించి సినిమాకు మాటలు రాసిన మనోజ్ ముంతాషిర్పై జనం మండిపడుతున్నారు. కొంతమంది ఆయన ఎక్కడ కనిపించినా నిలదీస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే తనకు ప్రాణాపాయం ఉన్నదని, రక్షణ కల్పించాలని రచయిత మనోజ్ ముంతాషిర్ ముంబై పోలీసులను కోరారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆదిపురుష్ వివాదం గురించి ప్రశ్నించగా.. ఆ విషయం తనకేమీ తెలియదని, దర్శకుడు ఓం రౌత్నే అడగాలని పేర్కొన్నారు. ఆ సినిమాకు తాను కేవలం మాటలు, పాటలు మాత్రమే రాశానని, అంతకుమించి తన ప్రమేయం ఏమీ లేదని అన్నారు.
సినిమా కథ, పాత్రలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా దర్శకుడు ఓం రౌత్నే అడగాలని చెప్పారు. సినిమా మాటలు ఒరిజినల్ రామాయణాన్ని చెక్ చేసే రాశారా..? అని అడగ్గా.. తాను పూర్తిగా దర్శకుడు ఓం రౌత్‌పై నమ్మకం పెట్టుకుని రాశానని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

