Zara Hatke Zara BachKe | ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న విక్కీ కౌశల్ ‘జర హట్కే జర బచ్కే’
Zara Hatke Zara BachKe | బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’ (zara hatke zara bachke). ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్‌తో కలిసి మ్యాడాక్ ఫిలింస్ నిర్మించింది.
Zara Hatke Zara BachKe | బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’ (zara hatke zara bachke). ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్‌తో కలిసి మ్యాడాక్ ఫిలింస్ నిర్మించింది. గతేడాది జూన్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. కేవలం రూ.40కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.115 కోట్లు వసూళ్లను రాబట్టింది. కొత్తగా పెళ్ళైన దంపతులు వైవాహిక జీవితం కోసం కుటుంబం నుంచి విడిపోయేందుకు చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథ. అయితే ఈ సినిమా విడుదలై 11 నెలలు అవుతున్న ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ప్రేక్షకులు ఎప్పుడు ఈ సినిమా చూద్దామన్నా నిరాశే ఎదురయ్యింది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ అప్డేట్ వచ్చింది.
ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమా ఈ సినిమాను మే 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జియో సినిమా ప్రకటించింది.
Sah-parivaar shaadi ki thi, ab sah-parivaar divorce bhi hoga! Toh aap sab #DivorceMeinZaroorAana 💔#ZaraHatkeZaraBachke streaming May 17 onwards, exclusively on JioCinema Premium. #ZHZBOnJioCinema #JioCinemaPremium@vickykaushal09 @SaraAliKhan pic.twitter.com/Vy4K5tLJDy
— JioCinema (@JioCinema) May 12, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

