పొలం గట్ల మీద కందుల సాగు!
వరి సాగుతోనే సరిపెట్టకుండా.. అదే పొలంలో మరో పంటనూ పండిస్తూ ఆదనపు దిగుబడి సాధిస్తున్నారు మధ్యప్రదేశ్‌లోని షహ్డోల్ జిల్లాలోని సుధ్వార్ గ్రామానికి చెందిన రైతులు.
- పప్పుధాన్యాల సాగులో ఆదర్శంగా నిలిచిన సుధ్వార్ గ్రామ రైతులు
- 28,150 హెక్టార్లలో సాగు
- ‘దాల్ వాలా గావ్”గా గుర్తింపు
భోపాల్: వరి సాగుతోనే సరిపెట్టకుండా.. అదే పొలంలో మరో పంటనూ పండిస్తూ ఆదనపు దిగుబడి సాధిస్తున్నారు మధ్యప్రదేశ్‌లోని షహ్డోల్ జిల్లాలోని సుధ్వార్ గ్రామానికి చెందిన రైతులు. నిరుపయోగ పొలం గట్లనే సాగు భూములుగా మార్చేశారు. వరితోపాటు కందులు పండిస్తూ కుటుంబానికి సరిపడా పప్పుధాన్యాలను సమకూర్చుకుంటున్నారు. ఈ వినూత్న ప్రయోగంతో ఆ గిరిజన గ్రామం ఇప్పుడు ఇతర ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నది. గోహ్పారు బ్లాక్‌లోని ఈ గిరిజన గ్రామం ‘పప్పుధాన్యాల గ్రామం’గా పేరొందుతున్నది. రెండెకరాల్లో వరి సాగు చేస్తున్న రైతు సంతోష్ సింగ్ పొలం గట్లపై కందులు పండిస్తూ, అదనంగా 130 నుంచి 150 కిలోల దిగుబడి పొందుతున్నారు. మరో రైతు హరిదిన్ సింగ్ ఎకరా పొలంలో 60 నుంచి 80 కిలోల కందులు పండిస్తున్నారు.
గతంలో నిరుపయోగంగా ఉన్న గట్లు వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో ఈ విధానం ఇతర గ్రామాలకూ విస్తరిస్తున్నది. చిన్న కమతాలున్న రైతులు సైతం కుటుంబ అవసరాలకు సరిపడా పప్పుధాన్యాలను పండించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. షహ్డోల్ జిల్లాలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 2025 ఖరీఫ్‌లో 27,500 హెక్టార్లుండగా, 2026లో 28,150 హెక్టార్లకు పెరిగింది. కందుల సాగు 14,000 నుంచి 14,350 హెక్టార్లకు చేరింది. రబీ సీజన్లోనూ సాగు విస్తరణ లక్ష్యాన్ని పెంచారు. తక్కువ భూమిలోనే అదనపు పంట సాధ్యమని సుధ్వార్ రైతులు నిరూపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

