అల్లుడు సన్యాసుల్లో కలుస్తాడు.. కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది
పుట్టింటికి వచ్చిన కూతురిపై ఆకతాయిలు ఆత్యాచార యత్నం చేయగా ఆమె తప్పించుకుంటుంది. ఈ విషయం తెలిసిన అల్లుడు సన్యాసుల్లో కలుస్తాడు. కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ బాధతో శాస్త్రి మంచాన పడి మరణిస్తాడు. ఈ కథ పన్నీరు కన్నీరు నవలలోనిది. పుస్తక సమీక్షలో భాగంగా ఈ నవల గురించి తెలుసుకుందాం.
చివరికి మిగిలేది..!
సంపద వచ్చేటప్పుడు కొబ్బరికాయలోకి నీరు చేరినట్లుగా ఎవరికీ తెలియకుండా సులభంగా వస్తుంది. పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జులా తెలియకుండానే మాయమవుతుంది. ఈ నవలా సారాంశం ఇదే కోవకు చెందినది. సిరిపాలెం గ్రామానికి చెందిన సూరపరాజు గ్రామంలో అందరికంటే ఆస్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరొచ్చినా తన ఇంట్లో చేయి కడగాల్సిందే. వరదల కారణంగా ఆ ఊరి కాలువల దశ మారిపోతుంది. పచ్చని పంటలతో సస్యశ్యామలమవుతుంది. ప్రతి ఇంట్లోనూ సిరిసంపదలకు కొదువ లేకుండా పోతుంది. ఆ సమయంలోనే నరసింహం సిరిపాలెంలో అడుగుపెడతాడు. సూరపరాజు ప్రోత్సాహంతో అక్కడే ఉంటూ బ్రాహ్మణ పిల్లలకు వేదాలు నేర్పిస్తాడు. కొంతమంది వ్యతిరేకించినా నరసింహం చివరికి ఆ ఊరి అల్లుడిగా స్థిరపడతాడు.
ఇదిలా ఉండగా సూరపరాజు కొడుకు సుబ్బారావు పెండ్లి గొప్పింటి బిడ్డతో ఘనంగా జరిపించడంతో పాటు కూతురి పెండ్లిని స్థాయికి మించి చేసి అప్పుల పాలవుతాడు. ఆ బాకీలు తీర్చలేక మంచాన పడి కన్నుమూస్తాడు. కొడుకు సుబ్బారావు ఇల్లు, ఊర్లోని కొంత పొలాన్ని అమ్మి అప్పులు తీర్చి కుటుంబంతో సహా బతుకుదెరువు కోసమని నగరానికి వెళ్తాడు. సుబ్బారావు కొడుకు సూర్యను బాగా చదివించి గొప్పవాణ్ని చేయాలని కలలు కంటాడు. ఆ తోవలోనే సూర్య ఆలోచనలూ ఉంటాయి. ఫీజు కట్టలేని పరిస్థితిలోనూ నరసింహం సహకారంతో స్కాలర్షిప్ పైనే చదువుకొని సివిల్స్ సాధిస్తాడు. కట్నం మీద ఆశతో ఒకే కులమైనా… శాఖల అంతరాలు చూపి నరసింహం కూతుర్ని కాకుండా రిటైర్డ్ జడ్జి కూతురితో సూర్య వివాహం జరిపిస్తాడు సుబ్బారావు.
కొడుకు ఉన్నతమైన ఉద్యోగం చేసినా కుటుంబ పరిస్థితులు ఏ మాత్రం మెరుగు పడవు. దానికితోడు తన భార్య పెత్తనంతో సూర్య తల్లిదండ్రులకు దూరంగా ఉంటాడు. చివరికి తన తల్లి చావు బతుకుల్లో ఉందని ఉత్తరం రాసినా విస్మరిస్తాడు. ఈ జీవన ప్రయాణంలో ఎవరికి ఎవరూ తోడు రారంటూ కట్టెలే చుట్టాలుగా రచయిత ఈ నవలకు ముగింపు పలకడం పాఠకులలో దుఃఖంతో పాటు ఆలోచన రేకెత్తిస్తుంది. ఇదే నవలలో కూరపాడు గ్రామానికి చెందిన వెంకట శాస్త్రి కుటుంబాన్ని పరిచయం చేస్తాడు. శాస్త్రి ఎంతో విలువలతో కొడుకు, కూతురును పెంచుతాడు. లోకం బాధకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకున్నా బిడ్డకు పెండ్లి చేస్తాడు. ఓ సారి పుట్టింటికి వచ్చిన తన కూతురిపై ఆకతాయిలు ఆత్యాచార యత్నం చేయగా ఆమె వారినుంచి తప్పించుకుంటుంది. ఈ విషయం అల్లుడికి తెలిసి సన్యాసుల్లో కలుస్తాడు. కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ బాధతో శాస్త్రి మంచాన పడి మరణిస్తాడు.
తన కుటుంబం నాశనం అయ్యేందుకు ఈ సమాజమే కారణమని శాస్త్రి కొడుకు జీవిస్తుంటాడు. ఒకరోజు తానుంటున్న పూరిల్లు దగ్ధం అవ్వడంతో ఆ యువకుడు అందులోనే కాలిపోయుంటాడని గ్రామస్థులు భావిస్తారు. అయితే ఆ యువకుడే సిరిపాలెం గ్రామానికి చెందిన నరసింహం కావొచ్చని పాఠకులు అభిప్రాయపడతారు. రచయిత స్పష్టంగా వివరించనప్పటికీ సూరపరాజు కుటుంబానికి నరసింహ ఏదో ఒక రూపకంగా మేలు చేసే విధానమే చెబుతుంది శాస్త్రి గారి విలువ పెంపకం గురించి. సామాజిక అంశాలతో కూడిన ఈ నవల ఈ తరానికి ఎంతో అవసరం.
పన్నీరు కన్నీరు (నవల)
రచయిత: నందివాడ భీమారావు
పేజీలు: 131, ధర: 120
ప్రతులకు: 99591 51546
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

