బతుకులు కూల్చి బూతు మాటలా?
ప్రభుత్వాలు సంక్షేమాన్ని అందించాలని ప్రజలు కోరుకుంటారు. కొత్తగా ప్రవేశపెట్టే పథకాలు తమ బతుకులను మార్చుతాయని ఆశపడుతారు. తమ కష్టాలు తీరుతాయని, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కలలు కంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకం ప్రారంభోత్సవంలో పాలకులు ఏం చెప్తారో వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ ఆ నేతలు వచ్చి, ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకొని సభలు నిర్వహిస్తుంటే ప్రజల పరిస్థితి ఏమిటి? వారి ఆశలు ఏమైపోతాయి? ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీరు అచ్చం ఇదే.
ప్రభుత్వాలు సంక్షేమాన్ని అందించాలని ప్రజలు కోరుకుంటారు. కొత్తగా ప్రవేశపెట్టే పథకాలు తమ బతుకులను మార్చుతాయని ఆశపడుతారు. తమ కష్టాలు తీరుతాయని, తమ పిల్లల భవిష్యత్తు
బాగుంటుందని కలలు కంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకం ప్రారంభోత్సవంలో పాలకులు ఏం చెప్తారో వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ ఆ నేతలు వచ్చి, ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకొని సభలు నిర్వహిస్తుంటే ప్రజల పరిస్థితి ఏమిటి? వారి ఆశలు ఏమైపోతాయి? ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీరు అచ్చం ఇదే. అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా ఇంకా ప్రతిపక్ష పాటనే పాడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి. ఏ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా తన ఉపన్యాసం తిట్లతోనే నిండిపోతున్నది. జనాలకు రోత పుట్టించే మాటలను తన నోట పలుకుతూ విరక్తిని కలిగిస్తున్నారు.
ఒకప్పుడు ఊర్లో అమ్మలకలు నీళ్ల కోసం గొడవలు పెట్టుకునే చిత్రాలు చూశాం. బావులు, బోర్లు, నల్లాల దగ్గర గొడవలు సర్వసాధారణంగా ఉండేవి. అక్కడ వాడే భాష వినబుద్ధి అయ్యేది కాదు. కానీ సీఎం ఆ భాషను మించిన భాష మాట్లాడుతున్నారు. సభావేదికలను గొడవల అడ్డాగా మార్చుతున్నారు. ఇటీవల సీఎం సిద్దిపేట సభ ఇందుకు నిదర్శనం. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి గంటకు పైగా తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం కోసం అని ఆ సభ పెట్టారు. కానీ పథకం గురించి వివరించాల్సింది పోయి, ప్రతి పక్షాలపై తిట్లు అందుకున్నారు. కేసీఆర్ పేరు 63 సార్లు, హరీశ్‌రావు పేరు 53 సార్లు, కేటీఆర్ పేరును 24 సార్లు ఎత్తుతూ సహనాన్ని కోల్పోయి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తమ పాలన గురించి చెప్పుకోవడం మానేసి, ప్రతిపక్ష నేతల పేర్లు జపం చేయడం అంటే ఆయన మనసులో ఎంత అభద్రత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా జనాలను చలోక్తులతో ఉత్సాహపరుస్తారు. ఆయన మాటల్లో విషయం, యాస, హాస్యం ఉంటాయి. ఎంత కఠినమైన రాజకీయ అంశమైనా ప్రజలకు అర్థమయ్యే పలుకుబడుల్లో వివరిస్తారు. ఉద్యమనాయకుడిగా ప్రజలను చైతన్యవంతులను చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ సభ పెడితే ప్రజలకు ఎంతో భరోసా లభించేది. కానీ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తిట్ల కోసమే సభలు పెడుతున్నారా అనిపిస్తున్నది. అది కూడా ప్రజల సొమ్ముతో కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం?
ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పనులు చేయాలి. కాంగ్రెస్ గద్దెనెక్కి మూడేండ్లు అవుతున్నది. పాలన పక్కకుపెట్టి గత ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తే ప్రజలు భరించే స్థితిలో లేరు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తిట్లే పాలన అనుకుంటే ఎట్లా? తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్ర అభివృద్ధి చూశాం. అందులో భాగంగా మాజీమంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో సిద్దిపేట అభివృద్ధి ఎట్లా జరిగిందో మన కండ్ల ముందు కనిపిస్తున్నది. రోడ్లు, చెరువులు, పారులు, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, పోలీస్ కమిషనరేట్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు అకడ జరిగాయి. కానీ సీఎం అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతారు? అదీ.. సిద్దిపేట గడ్డపై.
సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేటలో తిరగకుండానే సభా వేదికకు వెళ్లారు. కాబట్టి సిద్దిపేట అభివృద్ధి కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆయన కాస్త సమయం తీసుకుని పట్టణంలో తిరిగి ఉంటే అభివృద్ధి అంటే ఇలా ఉంటుందా..! అని అర్థమయ్యేది. కోమటిచెరువు చుట్టూ వచ్చిన మార్పు, రంగనాయకసాగర్ ప్రాజెక్టు వల్ల ప్రాంతం సస్యశ్యామలమైన తీరు, పట్టణంలో వచ్చిన మార్పులు ఆయన చూడాలని అనుకుంటే కనిపించేవి. అలాగే అకడి రైతులు, యువకులు, మహిళలను కలిసి మాట్లాడితే కూడా మంచిగుండేది. కాంగ్రెస్ పాలన ఎంత సక్కదనం ఉన్నదో తెలిసేది. ఇవేమీ చేయకుండా కేవలం వేదిక మీదికిపోయి తిట్లు తిట్టడమే పనిగా పెట్టుకుంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో ఎట్ల తెలుస్తది? సిద్దిపేట సభకు ప్రజల నుంచి స్పందన రాలేదు. కాంగ్రెస్ నేతలకు సిద్దిపేట సభ ఒక హెచ్చరిక. ప్రజలు తిట్లు వినడానికి సభలకు రారు. తమ బతుకులు మారే మాట ఏదైనా చెప్తారేమో విందామని వస్తారు. మూడేండ్లలో ప్రజల బతుకులు కూల్చి బూతు మాటలేంది? ప్రజలు అధికా రం ఇచ్చింది… చేతనైతే పాలించడానికి.
రాజు పిల్లనగోయిన
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

