విల్లా కొన్న మొత్తం స్థలం వంకర-టింకరగా ఉండొచ్చా.. ఎండ్ ప్లాట్స్‌కు వాస్తుదోషం ఉంటుందా?
మేమొక విల్లా కొన్నాం. ఆ కాలనీ మొత్తం స్థలం వంకర-టింకరగా ఉంది. అలా ఉండొచ్చా?, మా వెంచర్లో ‘ఎండ్ ప్లాట్స్' ఎవరూ కొనడం లేదు. వాటికి వాస్తుదోషం ఉంటుందా? వంటి విషయాలు శుభవాస్తులో తెలుసుకుందాం.
ఇంటికి ఏ ముఖద్వారం మంచిది? రోడ్డు ఎంత వెడల్పు ఉంటే బాగుంటుంది?: వి. సీత, జీడిమెట్ల
రోడ్లు మనం తయారు చేసుకునేవి కావు. వాటిని ఎంచుకోవడం మాత్రమే మనం చేయగలం. విశాలమైన వీధి.. ఏ దిశకు ఉన్నా మంచిదే! కానీ, అది దిశలతో ‘పూర్ణంగా’ ఉండాలి. గుణవంతురాలు పేదపిల్ల అయినా, కుటుంబాన్ని చక్కదిద్దినట్టు.. గొప్పదిశ కలిగిన భూమి దక్షిణం దిక్కు అయినా.. ఆ చోట ఇల్లు కడితే అది ఎంతో ఉన్నతిని ఇస్తుంది. కనీసం 30-40 అడుగులు ఉన్న వీధులు ఎంతో కళకళలాడుతాయి. వీధి వేరుగా ఉండి, రెండు వైపులా సర్వీస్ రోడ్డు ఉంటే.. ఆ స్థలాలు , ఇండ్లు ఎంతో రక్షణతో, చక్కగా నిలబడతాయి. కొత్తగా లే అవుట్ చేసేవారు స్థలం పోతుందని ఇరుకిరుకు రోడ్లు వేస్తారు. కనీసం 30 అడుగులకు తగ్గని వీధులు ఉన్నప్పుడే కొంత యోగ్యంగా ఉంటుంది. వీధి అనేక విధాలైన రాకపోకలకు ఉపయోగపడుతుంది. అత్యవసర సమయాల్లో ఇంటి ముందు ఒక అంబులెన్స్ ఆగినా, మిగతా వాహనాలకు ఇబ్బంది రాకుండా, పాదచారులకు కష్టం కాకుండా, శాస్త్రబద్ధంగా విశాలమైన రోడ్లు ఉండటం అవసరం. కానీ, మన నగరాలు-రోడ్లు ఎంత విస్తరించినా సరిపోని రీతిలో ఉంటున్నాయి. మీరు మంచి దిశ కలిగిన రోడ్డును ఎంపిక చేసుకొని ఇల్లు కట్టండి. ముఖద్వారం ఏదైనా బాగానే ఉంటుంది.

Road
నైరుతిలో ‘వీధి శూల’ పడుతున్నది. పడమర రోడ్డు కూడా ఉంది. అక్కడ ఇల్లు కాకుండా అపార్ట్మెంట్ కట్టొచ్చా?: ఎ. శ్రీకాంత్, ఉప్పల్
నైరుతి వీధిపోటు ఇంటికైనా, అపార్ట్మెంట్కైనా మంచిది కాదు. దానిని సరిచేయాలి. ఎదురుగా వచ్చే చెడు వీధిని పూర్తిగా లోపలికి తీసుకున్నప్పుడు అది తొలగిపోతుంది. కానీ, కొంత స్థలం వదులుకోవాల్సి వస్తుంది. కానీ, పడమర వీధిశూల ఉన్నప్పుడు ఆ వీధిని అలాగే ఆ స్థలానికి దక్షిణం వీధిని చేసి, దక్షిణంలో కాంపౌండును వీధిని బయటికి చేసి కట్టి, మిగిలిన ఖాళీ స్థలాన్ని వేరుచేసి వాడాలి. అప్పుడు ఆ రోడ్డు.. ఆ స్థలానికి ఉత్తరం వీధి అవుతుంది. రోడ్డు, వీధులు వెళ్లి ఇండ్లమీద, ఫ్లాట్స్ మీద పడకుండా సవరించి, జాగ్రత్తగా నిర్మాణం చేయండి.

Venture
మా వెంచర్లో ‘ఎండ్ ప్లాట్స్’ ఎవరూ కొనడం లేదు. వాటికి వాస్తుదోషం ఉంటుందా?: డి. శ్రీకర్, శామీర్‌పేట
ఇంటి ముందు దారి.. ఇల్లు దాటి పోవాలి. అప్పుడే ఆ గృహం శుభగృహం అవుతుంది. మీరేకాదు, ఎవరు వెంచర్ చేసినా తప్పకుండా కొన్ని ‘డెడ్ ఎండ్’ ప్లాట్స్, విల్లాలు వస్తాయి. అలాంటివి రాకుండా ఉండాలి అంటే.. వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్‌ను ఆనుకొని ఒక రోడ్డు తప్పకుండా వేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎండ్ ప్లాట్స్ అనేవి ఉండవు. కొంత స్థలం పోతుంది. కానీ, అన్నీ బాగుంటాయి. తూర్పు రోడ్డు ఉండి, దక్షిణం నుంచి ఉత్తరానికి నడిచే రోడ్డు ఉన్నప్పుడు ఆ ప్లాట్ లేదా విల్లా.. చివరలో ఉన్నా మంచిదే! అలాగే, ఇంటికి ఉత్తరం రోడ్డు ఉండి, ఆ వీధి పడమరలో ప్రారంభమై, తూర్పుగా సాగినప్పుడు కూడా ఆ స్థలాలు, ఇండ్లను డెడ్ ఎండ్‌గా భావించకూడదు. మీరు మీకున్న స్థలాన్ని బట్టి వెంచర్లో ఎండ్ ప్లాట్స్ లేకుండా చేయండి. అందరికీ మంచిదే!

Villa
మేమొక విల్లా కొన్నాం. అయితే, ఆ కాలనీ మొత్తం స్థలం వంకర-టింకరగా ఉంది. అలా ఉండొచ్చా?: కె. శ్రీధర్, కొండాపూర్
కాలంలో మార్పు వస్తుంది.. అని అందరూ దాటవేస్తూ ఉంటారు. కానీ, మార్పు వచ్చింది మనుషుల ప్రవర్తనలో. ఒకనాడు స్థలం మొత్తం ఒక పద్ధతిలో మూలమట్టానికి చేసి, అపార్ట్మెంట్లు, కాలనీ వెంచర్లు చేసేవారు. నేడు డబ్బు ప్రాధాన్యం పెరిగి, ఎలా ఉంటే అలా.. ఆ స్థలాన్ని వదిలి, అందులోనే ఇండ్లు కడుతున్నారు. అందుకే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ, అవస్థలు తప్పడం లేదని బాధపడుతుంటారు అనేకులు. ఒకటి మన ఇంటికి తప్పక కాంపౌండు ఉండాలి. తర్వాత ఇల్లు శాస్త్రబద్ధంగా నిర్మితమై ఉండాలి. ఇవి పాటించాల్సిన అవసరం ఉంది. కొనే ముందే మన వీధి, దాని పరిసరాలు, ఆ విల్లాలు ఉన్న వెంచర్ భౌగోళిక ఉనికి.. అన్నీ చూసుకొని సరైన వెంచర్‌ని ఎంచుకోవాలి. మీరు మీ గృహం వరకు అన్నీ బాగున్నాయా? అనేది ముందుంగా చూసి, అందులో ఉండాలా? వద్దా? అనేది నిర్ణయించుకోండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

