అటకెక్కిన నకిలీ ఎన్వోసీల కేసు!
హైడ్రా జారీ చేసిన ఎన్వోసీలు మూడునెలల కిందట ఈ సంవత్సరం ఆగస్టులో సంచలనం సృష్టించాయి. జీహెచ్ఎంసీలోని ఫైర్విభాగం హైడ్రాలో విలీనం అయిన తర్వాత నుంచి క్యూర్ పరిధిలోని పలు భవనాలకు హైడ్రా ఎన్వోసీలు జారీ చేసింది.
- పోలీసులకు ఫిర్యాదు వరకే పరిమితమైన అధికారులు
- కళాశాలలపై ఒత్తిడి పెంచడంతో కేసు నుంచి దృష్టి మరల్చిన సర్కార్
- అసలు సూత్రధారులను బయట పెట్టకుండాపోలీసుల జాప్యం
- హైడ్రాలో ఒక కీలక అధికారి పాత్రపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
- కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ ఆరోపణలు
- హైడ్రా మౌనం వెనక ఆంతర్యమేంటో..
సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ):హైడ్రా జారీ చేసిన ఎన్వోసీలు మూడునెలల కిందట ఈ సంవత్సరం ఆగస్టులో సంచలనం సృష్టించాయి. జీహెచ్ఎంసీలోని ఫైర్విభాగం హైడ్రాలో విలీనం అయిన తర్వాత నుంచి క్యూర్ పరిధిలోని పలు భవనాలకు హైడ్రా ఎన్వోసీలు జారీ చేసింది. ఇందులో భాగంగా గత సంవత్సరం హైడ్రా విద్యాసంస్థలకు జారీ చేసిన ఎన్వోసీలు కలకలం సృష్టించాయి. ఇందులో ఫేక్ ఎన్వోసీలు ఉన్నాయంటూ అప్పట్లో కలకలం రేగింది. నగరంలోని కొన్ని ప్రైవేటు కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించినట్లు హైడ్రా అదనపు కమిషనర్ వర్ల పాపయ్య జూలై 4వ తేదీన లేక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 ప్రైవేటు కళాశాలలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా పలువురు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటర్‌బోర్డుకు ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చినట్లుగా హైడ్రా ఫిర్యాదులో పేర్కొనడంతో వ్యవహారం సంచలనాత్మకంగా మారింది. ఇంటర్ విద్యాశాఖ అనుమానించిన 142 జూనియర్ కళాశాలల ఫైర్ ఎన్ఓసీలలో అందులో 90వరకు అసలువని, మిగతా 52 ధృవపత్రాలు నకిలీవని హైడ్రా తెలిపింది. హైడ్రా కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కమిషనర్ పేరు మీద దొంగ సంతకాలతో ఫేక్ ఎన్వోసీలు సృష్టించారంటూ చేసిన ఫిర్యాదుపై ఇప్పటివరకు అసలు దొంగలను బయటపెట్టడంలో పోలీసు శాఖ విఫలమవుతోంది.
కళాశాలలపై ఒత్తిడితో దృష్టి మరల్చి!
హైడ్రా అధికారులు ఇంటర్బోర్డులో రెండుమూడురోజుల పాటు కళాశాలల ఎన్వోసీలు పరిశీలించి వాటిలో కొన్నిటిని నకిలీలుగా తేల్చారు. అయితే ఆ నకిలీలు ఇచ్చిందెవరనే విషయంలో దర్యాప్తు తుది దశకు చేరుకోకపోగా ఇంటర్‌బోర్డు మాత్రం ఆయా కళాశాలలపై చర్యలు తీసుకోవడానికి సిద్దమై వారి అనుమతులను పెండింగ్‌లో పెట్టింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ కళాశాలలపై ఎంతో కొంత పెనాల్టీ వేసి తమకు అనుమతులు ఇవ్వాల్సిందిగా యాజమాన్యాలు బోర్డును కోరుతున్నాయి. దీంతో ఫేక్ ఎన్వోసీల దృష్టి అసలు దోషుల నుంచి మరలి కళాశాలల వైపు తిరిగింది. ఈ ఎన్వోసీలు ఒక్కొక్కటీ ఆరు లక్షల వరకు పెట్టాల్సి వచ్చిందంటూ అప్పట్లో చర్చ జరగగా అసలు ఇవి తయారు చేసిన వారెవరనేది ఇప్పటివరకు పోలీసులు బయటపెట్టలేదు. దర్యాప్తు ఎంతమేరకు జరిగింది.. హైడ్రా కమిషనర్ సంతకాలనే ఫోర్జరీ చేసిన వారెవరో తేల్చడంలోపోలీసులు ఎందుకు జాప్యం చేశారనే విషయంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఆ కళాశాలలను టార్గెట్ చేసి వాటిపై చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ తనపని తాను చేసుకుపోతుంటే తమ సంస్థ నుంచి జారీ అయినట్లుగా ఉన్న ఫేక్ ఎన్వోసీల విషయంలో హైడ్రా కూడా పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉందని పోలీసులే అంటున్నారు.
హైడ్రా పాత్రపై అంతా గప్‌చుప్..!
గత రెండేళ్లుగా నగరంలో పలు భవనాలకు హైడ్రా ఎన్వోసీలు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో ఫైర్ విభాగం ఉన్న సమయంలో అక్కడి నుంచి ఎన్వోసీలు తీసుకోవడం సులభం కాగా హైడ్రాకు చేరిన తర్వాత చాలా కష్టంగా మారింది. ఈనేపథ్యంలో నకిలీ పత్రాలు తయారు చేసి వాటినే చెలామణీ చేశారు. ఇందులో హైడ్రా సిబ్బంది పాత్ర లేకుండా నకిలీలు బయటకు రావని పోలీసులు అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎన్ని నకిలీలు ఇచ్చారనేది ఇప్పటివరకు బయటకు రావడం లేదు. కేవలం కళాశాలలకు సంబంధించిన నకిలీలలను ఇంటర్ విద్యాశాఖ గుర్తించింది కాబట్టే ఈ వ్యవహారం బయటపడింది తప్ప మిగతా భవనాలకు సంబంధించిన ఇచ్చిన వాటిలో ఎన్ని ఫేక్ ఎన్వోసీలు ఉన్నాయనేది ఈరోజు వరకు వెలుగుచూడడం లేదు. ఆ తర్వాత హైడ్రా ఎన్వోసీలకు సంబంధించి ఆన్లైన్ చేసిందే తప్ప అప్పటివరకు జారీ చేసిన వాటిలో ఎన్ని అసలువి అనేది సంఖ్య చెప్పడమే తప్ప జాబితా విషయంలో గోప్యత పాటిస్తున్నారు.
అసలు ఈ ఫేక్ ఎన్వోసీలలో ప్రస్తుతం హైడ్రాలో పనిచేస్తూ గతంలో వేరే శాఖలో పనిచేసిన ఒక కీలక అధికారి ఉన్నారని, అతని అండదండలతోనే ఈ మొత్తం నకిలీ వ్యవహారం నడిచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నకిలీల పేరుమీద కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఇందులో కొన్ని ఆసుపత్రులకు సైతం నకిలీలు ఇచ్చినట్లుగా ఒక సీనియర్ పోలీసు అధికారి ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. ఎలాంటి ఫిర్యాదు రాకుండా తామేం చేయలేమని, ఈ విషయంలో హైడ్రానే నకిలీలనే తేల్చి తమ దగ్గర ఉన్న సర్టిఫికెట్లతో బయట ఉన్న వాటిని సరిపోల్చుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫేక్ఎన్వోసీలపై పోలీసుల దర్యాప్తు కూడా పక్కన పడడానికి హైడ్రాలోని ఆ అధికారే కారణమని తెలుస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

