కొత్త మున్సిపాలిటీలకు ట్యాంకర్ల కొరత
కొత్త మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల కొరతతో నీటి సరఫరా చేసేది ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల కొరతతో నీటి సరఫరా చేయడం అధికారులకు కష్టంగా మారుతున్నది.
మేడ్చల్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కొత్త మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల కొరతతో నీటి సరఫరా చేసేది ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల కొరతతో నీటి సరఫరా చేయడం అధికారులకు కష్టంగా మారుతున్నది. మున్సిపాలిటీల పరిధిలో మంచి నీటి ట్యాంక్‌లకు సరఫరా చేసే బోర్లు ఎండిపోతున్న నేపథ్యంలో నీటి సరఫరా చేసేందుకు మున్సిపాలిటీలలో ఇబ్బందికరంగా మారింది. దీంతో తప్పని సరిగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే పరిస్థితి ఏర్పడింది.
కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటైన నాడు మున్సిపాలిటీలలో కలిసిన గ్రామ పంచాయతీల్లో ఉన్న ట్యాంకర్లను వినియోగిస్తున్నవి, అప్పటికే పాతవైపోవడంతో ప్రస్తుతానికి ట్యాంకర్లు మూలకు పడ్డాయి. కొత్త ట్యాంకర్లకు నిధుల లేమితో కొనలేని పరిస్థితి ఉంది. నవంబర్ నెలలోనే ఇలా ఉంటే వచ్చే జూలై వరకు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవల్సి ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొత్తగా ఏర్పాటైన మూడు మున్సిపాలిటీలకు కొత్త ట్యాంకర్లను మంజూరు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అర్బన్ ప్రాంతంగా మార్పు చెందిన జిల్లాలో వర్షపాతం లోటుతో 15కి గాను 9 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. కనీసం కొత్త ట్యాంకర్ల కొనుగోలు కోసమైనా నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీకి ఐదు చొప్పున ట్యాంకర్లను ఏర్పాటు చేస్తే నీటి ఎద్దడిని నివారించొచ్చు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

