అదృష్టవశాత్తూ ఆ రోజు వర్షం పడలేదు.. స్లాబ్ పని విజయవంతంగా ముగిసింది
ఆదిత్య ఆశ్చర్యంగా.. ‘నాన్నా! ఆ రోజు వర్షం వస్తే భయపడ్డారు. మరి ఇప్పుడేమో మీరే స్వయంగా నీళ్లు పోస్తున్నారు ఎందుకు?’ అని అడిగాడు. స్లాబ్ వేసేటప్పుడు నీళ్లు పడితే అది పాడవుతుంది. కొద్దిగా ఆరినాక నీళ్లు పోస్తేనే మరింత బలంగా, గట్టిగా తయారవుతుంది’ అని వివరించాడు.
అల్లరి
సరైన సమయం
ఒక ఊరిలో ఆదిత్య అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆదిత్య వాళ్ల నాన్న కొత్త ఇల్లు కడుతున్నాడు. ఒకరోజు ఆ ఇంటికి స్లాబ్ వేసే పని మొదలైంది. పనివాళ్లు ఎంతో కష్టపడి సిమెంట్, ఇసుక కలిపి పైన పరుస్తున్నారు. అంతలో ఆకాశంలో నల్లటి మేఘాలు వచ్చాయి. అది చూసి ఆదిత్య వాళ్ల నాన్న చాలా కంగారుపడ్డాడు. ‘అయ్యో! ఇప్పుడు వర్షం వస్తే స్లాబ్ తడిసి కొట్టుకుపోతుంది. మన కష్టమంతా వృథా అవుతుంది. కాపాడు స్వామీ’ అని దేవుణ్ని ప్రార్థించాడు. అదృష్టవశాత్తూ ఆ రోజు వర్షం పడలేదు. స్లాబ్ పని విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల తర్వాత ఆదిత్య వాళ్ల నాన్న ఇంటి పైకి వెళ్లి స్లాబ్ మీద నీళ్లు పోస్తున్నాడు. ఆదిత్య ఆశ్చర్యంగా.. ‘నాన్నా! ఆ రోజు వర్షం వస్తే భయపడ్డారు. మరి ఇప్పుడేమో మీరే స్వయంగా నీళ్లు పోస్తున్నారు ఎందుకు?’ అని అడిగాడు. దానికి వాళ్ల నాన్న నవ్వుతూ.. ‘బాబూ! స్లాబ్ వేసేటప్పుడు నీళ్లు పడితే అది పాడవుతుంది. కానీ, అది కొద్దిగా ఆరినాక నీళ్లు పోస్తేనే మరింత బలంగా, గట్టిగా తయారవుతుంది’ అని వివరించాడు. నాన్న మాటల్లోని అంతరార్థాన్ని ఆదిత్య అర్థం చేసుకున్నాడు. సరైన సమయంలో చేసే పనే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని తెలుసుకున్నాడు.
పెద్దల మాట
నువ్వు స్వార్థ రహితుడవైతే.. ఒక్క పారమార్థిక గ్రంథాన్నైనా చదవకుండానే, ఒక్క దేవాలయాన్ని అయినా దర్శించకుండానే పరిపూర్ణుడవు అవుతావు.
– స్వామి వివేకానంద

Vivekananda
చెప్పుకోండి
లక్ష్మీదేవి పుట్టకముందు.. ఆకు లేని పంట పండింది. ఇప్పటికీ ప్రతి ఇంటా ఉంది?
– ఉప్పు
ఎర్రటి పండు మీద.. ఈగైనా వాలదు?
– నిప్పు
తల్లి దయ్యం, పిల్ల పగడం?
– రేగుపండు
పద్యం-భావం
తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనఁగ
బ్రాణ మెవరి సొమ్ము పారిపోకను నిల్వ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఈ శరీరం ఎవరి సొత్తూ కాదు. ఈ ధనం ఎవరిదీ కాదు. ప్రాణం పోకుండా ఎవరూ ఉండరు. ఇదంతా ప్రకృతి సహజమని గ్రహించాలి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

