Infinix | ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (Infinix GT 20 Pro), ఇన్ఫినిక్స్ జీటీ బుక్ లాప్టాప్ (Infinix GT Book Laptop) లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది. గత నెలలో సౌదీ అరేబియాలో ఆవిష్కరించిన గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (Infinix GT 20 Pro) .. 108-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, డెడికేటెడ్ ఎక్స్5 టర్బో గేమింగ్ చిప్ కూడా ఇందులో జత చేస్తారని తెలుస్తోంది.
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (Infinix GT 20 Pro), ఇన్ఫినిక్స్ జీటీ బుక్ లాప్ టాప్ (Infinix GT Book Laptop)ల్లో ఆర్జీబీ లైటింగ్ కస్టమైజబుల్ ఫీచర్‌గా ఉంటది. ఈ నెల 21న ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్, ఇన్ఫినిక్స్ జీటీ బుక్ లాప్టాప్లను ఆవిష్కరించనున్నది. ఈ రెండు గేమింగ్ డివైజ్‌లు కూడా న్యూ జీటీ వర్స్ అంబరిల్లా, మ్యాగ్ కేస్, ఫింగర్ స్లీవ్స్, కూలింగ్ ఫ్యాన్, ఆర్జీబీ మ్యాట్, ఆర్జీబీ హెడ్ ఫోన్, ఆర్జీబీ మౌజ్ కలిగి ఉంటాయి. ఎల్ఈడీ ఇంటర్‌ఫేస్‌తోపాటు సైబర్ పంక్ ఆస్థెటిక్స్ స్ఫూర్తిగా సైబర్ మెచా డిజైన్‌తో రూపుదిద్దుకున్నదీ ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్. మరోవైపు ఇన్ఫినిక్స్ జీటీ బుక్ లాప్ టాప్ మెచా బార్ డిజైన్ విత్ కస్టమైజబుల్ ఆర్జీబీ లైటింగ్, ఫోర్ జోన్ లైటింగ్ ఆర్జీబీ కీ బోర్డు ఫీచర్లు ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ జీటీ బుక్ గేమింగ్ లాప్ టాప్ 16-అంగుళాల డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది. నివిదియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4060 జీపీయూతోపాటు 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ9-13900హెచ్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 190వాట్ల పవర్ అడాప్టర్ తోపాటు ఐసీఈ స్టోర్మ్ 3.0 డ్యుయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్, 70వాట్ల బ్యాటరీ ఉంటాయి.
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్ ధర సుమారు రూ.28,800 (1299 సౌదీ రియాద్లు) పలుకుతుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎక్స్ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2436 పిక్సెల్స్) ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ఎస్వోసీ చిప్ సెట్, డెడికేటెడ్ పిక్సెల్ వర్క్స్ ఎక్స్5 టర్బో గేమింగ్ చిప్ కూడా ఉంటాయి. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్ 108 మెగా పిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుందీ ఫోన్.