Kedarnath Temple | కేదార్ నాథ్ ఆలయంలో అపచారం.. శివలింగంపై నోట్లు వెదజల్లిన మహిళ
Kedarnath Temple | ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో వెలసిన కేదార్ నాథ్ (Kedarnath) ధామ్ ఎంతో పవిత్రమైనది. గత కొన్ని రోజులుగా కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా పవిత్ర కేదార్ నాథ్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ భక్తురాలు కరెన్సీ నోట్లు (Currency Notes) వెదజల్లడం వివాదాస్పదమైంది.
Kedarnath Temple | ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో వెలసిన కేదార్ నాథ్ (Kedarnath) ధామ్ ఎంతో పవిత్రమైనది. గత కొన్ని రోజులుగా కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా పవిత్ర కేదార్ నాథ్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ భక్తురాలు కరెన్సీ నోట్లు (Currency Notes) వెదజల్లడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది. అయితే సదరు మహిళ ఎవరన్నది తెలియరాలేదు.
వీడియోలో ఏముందంటే..? ఆలయ గర్భగుడిలోని శివలింగానికి (Shivling) పక్కనే నిలబడి ఉన్న మహిళ కేదారేశ్వరుడిపై కరెన్సీ నోట్లు వెదజల్లింది. ఆ సమయంలో గర్భగుడిలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఆలయ పురోహితులు మంత్రాలు పఠిస్తూ కనిపించారు. మహిళ అనుచితంగా ప్రవర్తిస్తున్నా అక్కడున్న వారు అడ్డుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, పవిత్ర కేదార్ నాథ్ ఆలయ గర్భగుడిలో వీడియోలు, ఫొటోలు తీయడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఈ వీడియో బయటకు రావడంపై శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తాజా ఘటనపై ఆలయ కమిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన సదరు మహిళపై విచారణ జరిపించాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోరారు.
Disgraceful!😡
1)A woman was seen showering money on Baba Kedarnath Shivling, in Uttarakhand!
2)How was the filming allowed, where photography & videography are strictly prohibited?@pushkardhami@KedarnathShrine@Pushpendraamu@ajeetbharti@meenakshisharan@erbmjha pic.twitter.com/r4kNosa0XA— BeingWoman🇮🇳 (@Lovepettyquotes) June 19, 2023
Also Read..
Chiranjeevi | లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం పలికిన చిరంజీవి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

