MLA Amanatullah Khan | 29న విచారణకు రండి.. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఈడీ నోటీసులు
మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు (MLA Amanatullah Khan) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని అందులో పేర్కొంది.
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు (MLA Amanatullah Khan) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఢిల్లీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిన నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే కేసులో గత వారం ఈడీ అధికారులు ఆయనను 13 గంటలపాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఢిల్లీ హైకోర్టు ఆయనకు శనివారం బెయిల్ మంజూరుచేసింది. రూ.15 వేల పూచీకత్తుతో బెయిల్ ఇఇస్తున్నట్లు తెలిపింది. కాగా, ఆయన జైలు విడుదల కాగానే మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీచేయడం గమనార్హం. ఇప్పటికే ఆయనపై ఏసీబీ, సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశాయి. చట్టవ్యతిరేకంగా ఇప్పటివరకు 32 మందిని నియమించారంటూ ఎఫ్ఐఆర్లో నమోదయింది. గతంలో కూడా అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అనుమానిస్తూ అమానతుల్లాను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

