Metro | సాధారణంగా ప్రయాణ సమయంలో ఆకలేస్తే తినడం సర్వసాధారణమే. అయితే, రూల్స్ పాటింకపోతే అధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ మహిళ మెట్రో రైల్లో ప్రయాణిస్తూ నిబంధనలను ఉల్లంఘించి ఆహారం తినింది (Woman Eating Inside Metro). ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. అధికారులు ఆమెకు భారీ ఫైన్ వేశారు.
బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఈనెల 26న మాదవర స్టేషన్ నుంచి మాగడి రోడ్డు వరకూ మెట్రో రైల్లో ప్రయాణించింది. ఆ సమయంలో ఆమె రైల్లో కూర్చొని తన టిఫిన్ బాక్స్‌లోని ఆహారాన్ని తినింది. తోటి ప్రయాణికుడు ఈ విషయాన్ని గుర్తించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే అదికాస్తా వైరల్‌గామారి మెట్రో అధికారుల దృష్టికి చేరింది. అప్రమత్తమైన అధికారులు మెట్రో నిబంధనలు ఉల్లంఘించిన సదరు మహిళను గుర్తించి ఫైన్ వేశారు. ఇవాళ ఉదయం స్టేషన్లో మహిళను ఆపి రూ.500 జరిమానా విధించారు. కాగా, మెట్రో ప్రాంగణంలో ఆహారం తినడం, పానీయాలు తీసుకోవడం వంటివి నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులకు అధికారులు ఫైన్ వేస్తారు.
Beware! Eating inside the Bengaluru metro could cost you , a woman was fined 500 rupees after a co passenger made a video of her eating and uploaded it on social media. The security team intercepted her today and fined her. pic.twitter.com/8NIbfCiytX
— Deepak Bopanna (@dpkBopanna) April 28, 2025
Also Read..
Yemen | యెమెన్‌లోని నిర్బంధ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు.. 68 మంది మృతి
Cheetah | కూనో పార్క్‌లో ఐదు కూనలకు జన్మనిచ్చిన నిర్వా.. దేశంలో 31కి పెరిగిన చీతాల సంఖ్య
BBC | పెహల్గామ్ ఉగ్రదాడి కవరేజీపై ఆగ్రహం.. బీబీసీ ఇండియా హెడ్‌కి కేంద్రం లేఖ