Cheetah | దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్క్ (Kuno National Park)లో చిరుత ‘నిర్వా’ (Nirva) ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈనెల 25న ఐదు కూనలకు నిర్వా జన్మనిచ్చినట్లు తెలిపారు. దీంతో భారత్‌లో మొత్తం చిరుతల సంఖ్య 31కి పెరిగింది. ప్రస్తుతం కూనో పార్క్‌లో 19 కూనలు, 10 పెద్ద చిరుతలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో రెండు మగ చిరుతలు ప్రకాశ్, పావక్లను గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు.
कूनो में नए मेहमानों का स्वागत है…
अत्यंत प्रसन्नता है कि कूनो राष्ट्रीय उद्यान में चीतों का कुनबा निरंतर बढ़ रहा है।
हाल ही में 5 वर्षीय नीरवा ने 5 शावकों को जन्म दिया है। इन नन्हे शावकों का आगमन चीता प्रोजेक्ट की सफलता और भारत की समृद्ध जैव-विविधता का प्रतीक है।
माननीय… pic.twitter.com/TRH33BrLJI
— Dr Mohan Yadav (@DrMohanYadav51) April 27, 2025
దేశంలో అంతరించిపోయిన చీతాల (Cheetahs ) పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి విడతల వారీగా చీతాలను భారత్‌కు తీసుకొస్తున్నారు. ఫిబ్రవరి 2023లో నిర్వా అనే ఆడ చీతాను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు. దాని వయసు ఐదున్నరేళ్లు. గతేడాది కూడా నిర్వా రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకే దురదృష్టవశాత్తూ ఆ రెండు చీతాలు మరణించాయి. ఇప్పుడు ఐదు కూనలకు నిర్వా జన్మనిచ్చింది.
కాగా, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కేంద్రం 2022, సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకొచ్చింది. అందులో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు వచ్చాయి. వీటన్నింటినీ మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పలు చిరుతలు మృతి చెందాయి. ప్రస్తుతం కూనో పార్క్‌లో 26 చిరుతలు ఉన్నాయి. వాటిలో 14 భారత్‌లో జన్మించిన కూన పిల్లలు. ఇప్పుడు నిర్వా ఐదు పిల్లలకు జన్మనివ్వడంతో మొత్తం చీతాల సంఖ్య 31కి పెరిగింది.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా త్వరలో మరో 8 చీతాలు భారత్‌కు రానున్నాయి. దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్వానా (Botswana ) నుంచి రెండు విడతల్లో చీతాలను భారత్‌కు తీసుకురానున్నట్లు అధికారులు ఇటీవలే ప్రకటించారు. తొలి విడతలో భాగంగా మేలో 4 చీతాలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో నాలుగు చిరుతలను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. దేశంలో చిరుత ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. అందులో 67 శాతం మధ్యప్రదేశ్‌లో చిరుత పునరావాసానికి వెళ్లిందని వెల్లడించారు.
Also Read..
BBC | పెహల్గామ్ ఉగ్రదాడి కవరేజీపై ఆగ్రహం.. బీబీసీ ఇండియా హెడ్‌కి కేంద్రం లేఖ
PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీతో రాజ్‌నాథ్, అజిత్ దోవల్ కీలక భేటీ
YouTube channels | పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం.. బీబీసీకి నోటీసులు