Yemen | యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) రెబల్స్‌పై అమెరికా (USA) భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హౌతీల నియంత్రణలో ఉన్న వాయువ్య యెమెన్‌లోని ఆఫ్రికన్ వలసదారుల నిర్బంధ కేంద్రంపై అమెరికా వైమానికి (US strike) దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 68 మంది మరణించినట్లు స్థానిక మీడియాని ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ నివేదించింది. సాదా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో 47 మంది గాయపడినట్లు పేర్కొంది. చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈ దాడిపై అమెరికా ఇంకా స్పందించలేదు.
ఈ నెల 18న కూడా యెమెన్‌లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా (US Attacks) విరుచుకుపడిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. గత నెల 17న కూడా హౌతీలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యెమెన్ రాజధాని సనా, సదా, హౌతీల బలమైన ప్రాంతం అల్బేద్, రాడాలపై అమెరికా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఎర్రసముద్రంలో అగ్రరాజ్య నౌకపైకి హౌతీలు దాడికి సమాధానంగా అమెరికా పెద్దఎత్తున జరిపిన బాంబు దాడుల్లో 31 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. బాంబు దాడులతో ఆయా ప్రాంతాలు భూకంపం వచ్చినట్టు కంపించిపోయాయని స్థానికులు తెలిపారు.
కాగా, ‘మీ టైం అయిపోయింది. ఈ రోజు నుంచే మీ దాడులను నిలిపివేయండి. అలా చేయకపోతే ఇంతకుముందెన్నడూ చూడని విధంగా నరకాన్ని చవిచూస్తారు. తమ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుంటే ఎప్పుడు చూడని రీతిలో బాంబుల వర్షం కురిపిస్తాం. ప్రపంచంలోని జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తీ ఆపలేదు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హౌతీలను హెచ్చరించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ 800 కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించినట్లు అమెరికా ప్రకటించింది. అంతేకాక వందల మంది హౌతీలు హతమయ్యారని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read..
Pakistan | భారత్‌పై ఆంక్షలు.. లక్షలాది డాలర్లు నష్టపోతున్న పాకిస్థాన్..!
Iran | ఇరాన్లో పేలుళ్ల ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య
YouTube channels | పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం.. బీబీసీకి నోటీసులు