Iran | ఇరాన్‌లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం భారీ పేలుళ్లు (Iran port blast) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1,000 మందికిపైగా గాయపడ్డారు. వారిలో 197 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు హోర్మోజ్గాన్ గవర్నర్ మొహమ్మద్ అషౌరి తజియాని ఊటంకిస్తూ స్థానిక మీడియా నివేదించింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది.
ఇరాన్ (Iran) లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఒక భవనం నేలకూలింది. దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. పేలుడు నేపథ్యంలో ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న పాఠశాలలు, కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటెయినర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి మెహర్దాద్ హసన్జాదే చెప్పారు. పేలుడులో పెద్దఎత్తున చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది (Fire fighterss) తీవ్రంగా శ్రమించారు. దాదాపు 10 గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యల్లో మొత్తం నాలుగు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పాల్గొన్నాయని హెర్మోజ్గాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ చీఫ్ ముక్తార్ సలాహ్షౌర్ చెప్పారు.
Also Read..
YouTube channels | పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం.. బీబీసీకి నోటీసులు
Kedarnath Dham | ముస్తాబవుతున్న కేదార్నాథ్ ఆలయం.. పూలతో అలంకరణ
India Pakistan | పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్