Kedarnath Dham | చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయాన్ని మే2వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ (Badrinath-Kedarnath Temple Committee) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వచ్చే నెల 2వ తేదీన ఉదయం ఆలయ తలుపులు తెరవనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.
ఇక బద్రీనాథ్ (Badrinath) ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. చార్ధామ్ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను సందర్శిస్తారు. ఈ యాత్ర నేపథ్యంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఈ నెల 30 నుంచి తెరవనున్నారు.
#WATCH | Uttarakhand | Kedarnath Dham being decorated with flowers ahead of its opening on 2 May, 2025.
Source: CM Pushkar Singh Dhami /’X’ pic.twitter.com/tlFdzAaa5U
— ANI (@ANI) April 28, 2025
Also Read..
India Pakistan | పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్
Pahalgam Attack | 22 గంటలు ట్రెక్కింగ్ చేసి.. కోకెర్నాగ్ అడవుల నుంచి పహల్గాంకు ముష్కరులు!