Mahant Prem Das | అయోధ్య : హనుమాన్‌గఢీ దేవాలయం ప్రధాన అర్చకుడు ‘గద్ది నషీన్’ మహంత్ ప్రేమ్ దాస్ (70) తన జీవితంలో మొదటిసారి ఈ గుడి, తన ఇంటి బయటకు రాబోతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 30న ఆయన రామాలయంలో బాల రాముడిని దర్శించుకోనున్నారు. శతాబ్దాల నుంచి వస్తున్న ఆచార, సంప్రదాయాల ప్రకారం గద్దీ నషీన్ తన జీవితంలో ఈ గుడి, ఇంటి నుంచి బయటకు రాకూడదు.
స్థానిక కోర్టులకు కూడా హాజరుకాకూడదు. అయితే, తనకు శ్రీరాముడిని దర్శనం చేసుకోవాలనే కోరిక ఉందని మహంత్ ప్రేమ్ దాస్ నిర్వానీ అఖాడాకు తెలియజేయగా ఆమోదించింది. దీంతో ఆయన ఈ నెల 30న నాగ సాధువులు, శిష్యు లు, భక్తులతో ఊరేగింపుగా వెళ్లి బాలరాముడిని దర్శించుకుంటారు.