పాట్నా: (Bihar Polls) ఎన్నికల్లో పోటీ చేసే వారు నామినేషన్ వేసేందుకు మందీమార్బలంతో వస్తుండటం చూస్తుంటాం. డప్పు వాయిద్యాల మధ్య బాణాసంచా వెలుగుల మధ్య అభ్యర్థులు ‘రాజు వెడలె రవి తేజములలరగా..’ అన్న రీతిలో రాజసం ఒలకబోస్తుంటారు. బిహార్‌లో ఎన్నికలు వచ్చాయంటే నాయకులు వారి విన్యాసాలు, చేష్టలతో సదా నాటకం రక్తి కట్టించేందుకు సిద్ధంగా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహదూర్‌పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నాచారి మండల్.. బర్రెపై వచ్చి నామినేషన్ వేశాడు.
అచ్చం అదే నాటకాన్ని మళ్లీ ఇన్ని రోజులకు ఓ అభ్యర్థి రక్తికట్టించారు. సోమవారం బర్రెపై ఎక్కి వచ్చిన ఆజాద్ ఆలం అనే వ్యక్తి నామినేషన్ వేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బర్రెపై రాజసంగా ఆజాద్ ఆలం కూర్చోగా.. మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆయనను ఫాలో అయ్యారు. వీడియోలో ఆలం బర్రెపై కర్ర పట్టుకుని కూర్చోగా.. మరో వ్యక్తి ఆ బర్రెకు దారి చూపిస్తున్నాడు. ఈ పెద్దాయన కతిహార్ జిల్లాలోని రాంపూర్ పంచాయతీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ‘నేను పశువుల కాపరిని. పెట్రోల్ పోసుకుని బండిలో రావడానికి నా వద్ద అంత డబ్బులు లేవు’ అని చెప్తున్నాడాయన.
ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్యాండిడేట్ అని నెటిజెన్ కామెంట్ చేయగా.. కాలుష్యాన్ని నివారించేందుకు ఇలాంటి విధానాన్ని ఎంచుకున్న ఈయనను మనమంతా అభినందించాల్సిందే అని మరో నెటిజెన్ రాశారు. ఇప్పటివరకు యమదూతలు మాత్రమే వచ్చేవారని విన్నాం.. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కూడా బర్రె ఉపయోగపడుతుందని చెప్తున్న ఈయన నిజమైన హీరో అని ఇంకొక నెటిజెన్ ఆకాశానికెత్తేశారు.
#WATCH | Bihar Panchayat Polls 2021: Azad Alam, a candidate from Katihar district's Rampur panchayat arrived to file his nomination on a buffalo yesterday pic.twitter.com/CBIF0bbqPl
— ANI (@ANI) September 13, 2021
నీట్ వ్యతిరేక బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం
యాంటీఆక్సిడెంట్ మందుతో గుండెపోటు నివారించొచ్చు
సౌరశక్తి పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలి: వెంకయ్యనాయుడు
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వే
పాకిస్తాన్‌కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్‌ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..