బెంగళూరు: కర్ణాటకలో 200కుపైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో సుమారు 400 ముస్లిం కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల బుల్డోజర్ చర్యను ఇక్కడ అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. (Karnataka demolitions) డిసెంబర్ 22న తెల్లవారుజామున 4 గంటల సమయంలో బెంగళూరు శివారు కోగిలు గ్రామంలోని ఫకీర్ కాలనీ, వాసిం లేఅవుట్లోని సుమారు 200కు పైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ నిర్వహించిన ఈ డ్రైవ్‌లో నాలుగు జేసీబీలు వినియోగించారు. 150 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఉర్దూ ప్రభుత్వ స్కూల్‌కు ఆనుకుని ఉన్న సరస్సు ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
కాగా, వందల సంఖ్యలో ఇళ్లను కూల్చివేయడంతో సుమారు 400కు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వీరిలో ఎక్కువగా ముస్లిం కుటుంబాలే ఉన్నాయి. తమకు ముందస్తు నోటీసు అందలేదని, పోలీసులు బలవంతంగా తమను ఖాళీ చేయించి ఇళ్లను కూల్చివేశారని నివాసితులు ఆరోపించారు. తీవ్ర చలికాలంలో వృద్ధులు, పిల్లలతో పాటు వందలాది మంది తాత్కాలిక గుడారాల కింద తలదాచుకుంటున్నట్లు వాపోయారు.
మరోవైపు ఇళ్ల కూల్చివేతల నేపథ్యంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బుల్డోజర్ రాజ్యాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారని వామపక్ష పార్టీలు మండిపడ్డాయి. కేరళ సీఎం పినరయి విజయన్ దీనిపై సీరియస్‌గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ‘మైనారిటీ వ్యతిరేక’ రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆయన విమర్శించారు.
Gut wrenching and heartless demolition of 300 houses of poorest of poor Muslim brethren in our Bengaluru, City of Millionaires. Bulldozers and Police flattened the houses of these hapless in 2 hours with no notice because they were staying on an abandoned quarry for past 25… pic.twitter.com/ecumH3X5KZ
— Bhaskar Rao (@Nimmabhaskar22) December 23, 2025
Also Read:
Ropeway Collapses | బీహార్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే.. ట్రయల్ రన్లో కూలింది