భోపాల్: చలి మంట ముందు కూర్చొన్న జనంపైకి బీజేపీ నేత కారు దూసుకెళ్లింది. దీంతో వారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఒక వృద్ధుడు, ఒక బాలుడు ఈ ప్రమాదంలో మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. (BJP Leader Rams Car Into People) మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున పోర్సా-జోటై రోడ్ బైపాస్ కూడలి సమీపంలోని ఇంటి ముందు కొందరు చలిమంట వేసుకున్నారు.
కాగా, బీజేపీ పోర్సా యువజన గ్రామీణ విభాగం వైస్ ప్రెసిడెంట్ దీపేంద్ర భదౌరియా చాలా వేగంగా కారు నడిపాడు. చలి మంట చుట్టూ కూర్చొన్న జనంపైకి కారును దూకించాడు. దీంతో కొందరు వ్యక్తులు గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని గ్వాలియర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 65 ఏళ్ల రామ్ దత్ రాథోడ్, పదేళ్ల అర్నవ్ లక్షకర్ మరణించారు. గాయపడిన మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
మరోవైపు మద్యం మత్తులో కారు నడిపి జనంపైకి దూకించిన బీజేపీ నేత దీపేంద్ర భదౌరియాను స్థానికులు పట్టుకున్నారు. అతడ్ని కొట్టి పోలీసులకు అప్పగించారు. అయితే దీపేంద్ర పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు.
దీంతో జనం ఆగ్రహించారు. పోలీసులు అతడ్ని తప్పించినట్లు ఆరోపించారు. పోర్సా-జోటై రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు. దీపేంద్రను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Another Hit and Run like Gujarat.
BJP leader under influence of alcohol rams car into 5 pedestrians tossing them around like football in Morena.
Locals catch hold of him and hand over to police but miraculously he escapes from police custody 🤦♂️#MadhyaPradesh pic.twitter.com/s10zrlWpIk
— D (@Deb_livnletliv) December 27, 2025
Also Read:
Ropeway Collapses | బీహార్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే.. ట్రయల్ రన్లో కూలింది
Watch: చనిపోయిన తర్వాత కూడా.. టీచర్ తలపై కాల్చుతూనే ఉన్న దుండగులు