పాట్నా: బీహార్‌లో కొత్తగా రోప్‌వే నిర్మించారు. అయితే ట్రయల్ రన్ సందర్భంగా అది కూలిపోయింది. అక్కడున్న కార్మికులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో రోప్‌వే నిర్మాణం నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తాయి. (Ropeway Collapses) బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో కొత్తగా రోప్‌వే నిర్మించారు. రోహ్తాస్ బ్లాక్ నుంచి రోహ్తాస్ గఢ్ కోట, రోహితేశ్వర్ ధామ్ వరకు రోప్‌వే ఏర్పాటు చేశారు.
కాగా, నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దీంతో రోప్‌వే ప్రారంభించే ముందు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే ఒక కేబుల్ చిక్కుకుపోవడంతో ఆ రోప్‌వే కూలిపోయింది. ట్రయల్ రన్ కోసం వినియోగించిన నాలుగు ట్రాలీలు చాలా ఎత్తునుంచి కిందపడి ధ్వంసమయ్యాయి. అయితే అందులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. అక్కడ పని చేస్తున్న కార్మికులు కూడా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
మరోవైపు కొత్తగా నిర్మించిన రోప్‌పై కూలిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రోప్‌వే నిర్మాణ నాణ్యతపై పలు ఆరోపణలు వచ్చాయి. రోప్‌వే కూలడంపై నిపుణుల బృందంతో దర్యాప్తు చేస్తామని ఇంజినీరింగ్ అధికారి తెలిపారు. ట్రయల్ రన్ ఫలితాలపై పూర్తిగా సంతృప్తి చెందే వరకు రోప్‌వేను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోమని అన్నారు.
रोहतास में रोपवे ट्रायल में ही टूट कर गिरा,13 करोड़ की लागत से बना रोपवे,नए साल पर आम लोगों के लिए खुलना था ..! #Bihar #Ropeway #Rohtas pic.twitter.com/8l4sMRp04l
— Mukesh singh (@Mukesh_Journo) December 26, 2025
Also Read:
Watch: వెనక నుంచి ఢీకొట్టిన సీఎం కాన్వాయ్‌లోని కారు.. పోలీస్ అధికారికి గాయాలు