Gaurav Gogoi : పార్లమెంటు (Parliament) లో ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ (Budget) పై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) స్పందించారు. బడ్జెట్లో ఏ మాత్రం పస లేదని విమర్శించారు. గడిచిన పదేళ్లలో ఇదే అత్యంత బలహీనమైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో సామాన్యులకు మేలు చేసే అంశం ఏమున్నదని ప్రశ్నించారు.
అదేవిధంగా మహా కుంభమేళాలో తొక్కిసలాటపై తాము పార్లమెంట్లో చర్చను కోరుకుంటున్నామని గౌరవ్ గొగోయ్ చెప్పారు. మహాకుంభమేళా తొక్కిసలాటపై చర్చకు డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు అందరం వాకౌట్ చేశామని, అయినప్పటికీ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా..? అనే విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు. సభలో చర్చ ద్వారానే ఏ విషయంలోనైనా నిజానిజాలు బయటికి వస్తాయని గొగోయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Custom duty | కేంద్ర బడ్జెట్.. 36 రకాల ఔషధాలపై 100 శాతం పన్ను మినహాయింపు
Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
Budget 2025 | ఉద్యోగులకు ఊరట కలిగేనా.. ఆదాయపు పన్ను పరిమితి పెంపుపై పదేళ్లుగా వివక్ష!
Union Budget | సీతమ్మ కరుణించేనా? పసుపుబోర్డుకు పైసలిచ్చేనా?
Gas Cylinder Price | బడ్జెట్‌కు ముందు గుడ్‌న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర