KTR | హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారం చేజిక్కించుకున్న ఒమర్ అబ్దుల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారీ విజయంతో మళ్లీ జమ్మూకశ్మీర్‌లో పునరాగమనం చేయడం అద్భుతమని ప్రశంసించారు. ఇండియాలోని అత్యంత అద్భుతమైన రాష్ట్రానికి పరిపాలన అందించబోతున్న మీకు మరోసారి శుభాకాంక్షలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపడుతారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధానికి సమర్పిస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా వరుసగా ఉంటాయని ఆయన తెలిపారు.
పదేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ ప్రజలు ఇండియా కూటమికి జై కొట్టారు. 90 స్థానాలకు గానూ 49 స్థానాలను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. మొదటిసారి ఒంటరిగా అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ 29 సీట్లకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటింది. ఏకంగా 42 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు ఉన్నప్పటికీ కేవలం ఆరు స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. 2014లో బీజేపీతో కలిసి అధికారాన్ని చేపట్టిన పీడీపీ ఈసారి దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్నది. అప్పుడు 28 సీట్లు గెలిచిన ఆ పార్టీకి ఇప్పుడు కేవలం మూడు స్థానాలే దక్కాయి. ఇండియా కూటమి భాగస్వామిగా సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకుంది. స్వతంత్రులు, వేర్పాటువాద అనుకూల నాయకులు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకొని ఖాతా తెరిచింది.
Congratulations @OmarAbdullah What a terrific comeback 👏
Like they say, you made sure your comeback was better than the setback
Best wishes in governing the most beautiful state of India 🇮🇳 (in anticipation that statehood will be restored soonest)
— KTR (@KTRBRS) October 9, 2024
ఇవి కూడా చదవండి..
Kolkata | కోల్‌కతా ఘటనకు నిరసనగా.. దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష, క్యాండిల్ మార్చ్
Rahul Gandhi | హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నాం : రాహుల్ గాంధీ
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి.. ట్రెండింగ్‌లోకి వచ్చిన జిలేబీ