Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) ముగిశాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి (adjourned sine die). ఇక ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నీట్ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత తదితర అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి.
పార్లమెంట్ సమావేశాలు గత నెల 22 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు 2023-24 ఆర్థికసర్వేను ఆర్థిక మంత్రి లోక్ సభలో ప్రవేశపెట్టారు. ‘భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది’ అని ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ఆ తర్వాత 23వ తేదీన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్డీయే కూటమి ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై ఉభయ సభల్లో వాడీవేడిగా చర్చ కొనసాగింది. చర్చ అనంతరం కేంద్ర బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది. ఇక ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకూ కొనసాగుతాయని ప్రభుత్వం ముందే ప్రకటించినప్పటికీ ఉభయ సభలు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి.
Both Rajya Sabha and Lok Sabha adjourned sine die
— ANI (@ANI) August 9, 2024
Also Read..
Rajya Sabha: జయా బచ్చన్ వర్సెస్ రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్.. వీడియో
Atishi | మనీశ్ సిసోడియాకు బెయిల్.. నిజం గెలిచిందంటూ భావోద్వేగానికి గురైన మంత్రి అతిషీ