న్యూఢిల్లీ: రాజ్యసభ(Rajya Sabha) చైర్మెన్ జగదీప్ ధన్కర్, ఎంపీ జయాబచ్చన్ మధ్య మరోసారి మాటల యుద్ధం సాగింది. జయా అమితాబ్ బచ్చన్ మాట్లాడాలని కోరుతూ చైర్మెన్ ధన్కర్ పిలిచారు. ఆ సమయంలో లేచిన జయా.. తనకు జయా అమితాబ్ బచ్చన్ అని పిలువాలని లేదన్నారు. తాను ఒక ఆర్టిస్టును అని, శరీర భాషను అర్థం చేసుకోగలనని, మీ స్వరం ఆమోదయోగ్యంగా లేదని చైర్మెన్ను ఆమె తప్పుపట్టారు. దీంతో చైర్మెన్ జగదీప్ ధన్కర్ సీరియస్ అయ్యారు. ఇక చాలు. నువ్వు ఎవరైనా కావొచ్చు. కానీ సభా మర్యాద పాటించాలని, డైరెక్టర్ ఆధీనంలోనే నటులు ఉంటారన్నారు. నువ్వు సెలబ్రిటీవే కావొచ్చు. నాకే గుర్తింపు ఉందన్న భావనలోనే ఉండకండని తెలిపారు. తాము కూడా గుర్తింపుతోనే ఈ స్థాయికి వచ్చినట్లు ధన్కర్ తీవ్ర స్వరంలో చెప్పారు.
జయా అమితాబ్ బచ్చన్ అని పిలిచినందుకు క్షమాపణలు చెప్పాలని ఎంపీ కోరారు. పార్లమెంట్ ఆవరణలో జయా మీడియాతో మాట్లాడుతూ.. చైర్మెన్ అన్-పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నట్లు ఆరోపించారు. నువ్వో న్యూసెన్స్, బుద్దీహీన్ అంటూ చైర్మెన్ తిడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సెలబ్రిటీ అయితే ఏంటీ, మేం పట్టించుకోమని కూడా జగదీప్ అన్నారని ఆమె చెప్పారు. తాను ఎంపీని అని, ఇది తనకు అయిదో టర్మ్ అని, తాను మాట్లాడేది తనకు తెలుసు అని, పార్లమెంట్లో అందరు మాట్లాడుతున్న తీరు, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. చైర్మెన్ తనకు క్షమాపణలు చెప్పాలని జయా డిమాండ్ చేశారు.
జగదీప్ ధన్కర్, జయా బచ్చన్ మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Jaya Bacchan – Sir I am an actor and understand the tone, facial expressions and behaviour !
VP Jagdeep Dhankhar – Jaya Ji every actor is subject to a director and sitting on this chair I see what u don’t.
………………………………………………………Today VP… pic.twitter.com/kaPxFBqXYG
— Rahul Jha (@JhaRahul_Bihar) August 9, 2024