భోపాల్: ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రోడ్డు పక్కన ఆగిన పోలీస్ వాహనం నుంచి అతడు తప్పించుకున్నారు. పారిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు పరుగుపెట్టారు. అయితే అదుపుతప్పిన ఒక పోలీస్ కిందపడిపోయాడు. (Man Escapes from Police Van) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వ్యాన్‌లో అతడ్ని తరలిస్తున్నారు.
కాగా, ఆ పోలీస్ వాహనం మార్గమధ్యలో ఆగిపోయింది. దీంతో పోలీసులు కిందకు దిగి రిపేర్ చేస్తున్నారు. వాహనంలో ఉన్న వ్యక్తి ఇదే అదునుగా భావించాడు. మెల్లగా డోర్ తెరిచాడు. పరుగున రోడ్డు దాటి పారిపోయాడు. గమనించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పరుగులుపెట్టారు. అయితే అదుపుతప్పిన ఒక పోలీస్ కిందపడిపోయాడు. మిగతా పోలీసులు అతడ్ని వెంబడించారు. అయితే ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారా? లేదా? అన్నది తెలియలేదు.
మరోవైపు సినిమా స్టైల్లో జరిగిన ఈ సంఘటన చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకుని నవ్వుకున్నారు. దీనిని రికార్డ్ చేసేందుకు కొందరు పోటీ పడ్డారు. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. పోలీసులపై పలు కామెంట్లు చేశారు.
ये तो Filmy Scene हो गया 😂
अपराधी भाग रहा गाड़ी से पुलिस पीछे पीछे @MPDial112 @MPPoliceDeptt
कृपया बताने का कष्ट करें आखिर क्या मामला है ? pic.twitter.com/C8Jb0NLtw5— Wasim Ahmed (@TheWittyWasim) December 19, 2025