బెంగళూరు: కొందరు పిల్లలు వీధిలో బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. నడిచి వెళ్లిన వ్యక్తి ఒక బాలుడ్ని వెనుక నుంచి ‘ఫుట్‌బాల్’ మాదిరిగా తన్నాడు. (boy kicked like a football by man) తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. కిందపడిన ఆ బాలుడు గాయపడ్డాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 14న త్యాగరాజనగర్ ప్రాంతంలోని అమ్మమ్మ ఇంటి దగ్గర ఐదేళ్ల నీవ్ జైన్ ఇతర పిల్లలతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు.
కాగా, అదే ప్రాంతంలో నివసించే రంజన్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఒక్కసారిగా పరుగెత్తిన అతడు నీవ్ జైన్‌ను వెనుక నుంచి ‘ఫుట్‌బాల్’ మాదిరిగా తన్నాడు. ఆ తర్వాత తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. కిందపడిన ఆ బాలుడి కాళ్లు, చేతులతోపాటు కంటిపై గాయాలయ్యాయి.
మరోవైపు కింద పడిన ఆ బాలుడ్ని మిగతా పిల్లలు పైకి లేపారు. అయితే ఏం జరిగిందో అన్నది తొలుత ఎవరికీ అర్థం కాలేదు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఆ బాలుడ్ని రంజన్ తన్నినట్లు తెలిసింది. దీంతో ఆ బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు గతంలో కూడా పలువురు పిల్లలను కొట్టాడని ఆమె ఆరోపించింది.
కాగా, పోలీసులు రంజన్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. అయితే మానసిక ఆరోగ్యం కోసం అతడు చికిత్స పొందుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. చికిత్స కోసం కోర్టు అనుమతి పొందారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంజన్‌ను హెచ్చరించి విడిచిపెట్టారు. అతడిపై నమోదైన కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే బాలుడ్ని ‘ఫుట్‌బాల్’ మాదిరిగా ఆ వ్యక్తి తన్నిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ತನ್ನ ಪಾಡಿಗೆ ಮಗು ಆಟ ಆಡ್ತಾ ಇದ್ದಾಗ ದಿಡೀರ್ ಅಂತ ಬಂದ ವ್ಯಕ್ತಿ ಮಗುವಿಗೆ ಒದ್ದ ದೃಶ್ಯ ಮೊಬೈಲ್ ಅಲ್ಲಿ ಸೆರೆ. #bangalore pic.twitter.com/ELARsnoSqh
— pragathi shetty (@pragathishett25) December 19, 2025
Also Read:
Opposition Sits On Overnight Protest | జీ రామ్ జీ బిల్లు ఆమోదంపై.. రాత్రంతా ప్రతిపక్షాల నిరసన
Watch: అత్త కాళ్లపై పడిన వ్యక్తి.. భార్యను ఇంటికి పంపాలని వేడుకోలు