న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని వీజీ-జీ రామ్ జీగా మార్పు చేసిన బిల్లును పార్లమెంటు ఆమోదించడంపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఎంపీలు గురువారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారు. 12 గంటలపాటు నిరసన కొనసాగించారు. (Opposition Sits On Overnight Protest) వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్‌గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) (వీజీ-జీ రామ్ జీ) బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్య గురువారం పార్లమెంటు ఆమోదించింది. రాజ్యసభలో అర్ధరాత్రి తర్వాత దీనికి ఆమోదం తెలిపారు.
కాగా, ప్రస్తుత ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్ష ఎంపీలు గురువారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలో 12 గంటల పాటు ధర్నా చేశారు. కొత్త బిల్లు రైతులు, గ్రామీణ పేదల వ్యతిరేకమని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు.
Also Read:
Teen Raped and Blackmailed | కాలేజీ యువతిపై అత్యాచారం, బ్లాక్మెయిల్.. ముగ్గురు అరెస్ట్
Ghaziabad Woman Murder | ఇంటి కిరాయి అడిగిన ఓనర్.. హత్య చేసి సూట్‌కేసులో కుక్కిన దంపతులు
Watch: అత్త కాళ్లపై పడిన వ్యక్తి.. భార్యను ఇంటికి పంపాలని వేడుకోలు