బెంగళూరు: కాలేజీ యువతిని ప్రేమ పేరుతో ఒక విద్యార్థి లోబర్చుకున్నాడు. అతడి స్నేహితులు దీనిని రికార్డ్ చేశారు. ముగ్గురూ బ్లాక్మెయిల్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. (Teen Raped and Blackmailed) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మాగడి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యవతి కాలేజీలో చదువుతున్నది. ఆరు నెలల కిందట కాలేజీ స్టూడెంట్ వికాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
కాగా, ప్రేమ పేరుతో ఆ యువతిని వికాస్ లోబర్చుకున్నాడు. అతడి ఫ్రెండ్ ప్రశాంత్ ఇంటికి ఆమెను పలుమార్లు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో స్నేహితుడు చేతన్ దీనిని రికార్డ్ చేశాడు. ఆ ముగ్గురూ కలిసి సెప్టెంబర్ నుంచి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. తాము కోరినప్పుడల్లా ఆ రూమ్‌కు రావాలని బెదిరించారు. గత రెండు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు.
మరోవైపు వారి లైంగిక వేధింపులను ఆ యువతి భరించలేకపోయింది. డిసెంబర్ 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ యువతికి తెలిసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుల్లో ఇద్దరు విద్యార్థులని వెల్లడించారు.
Also Read:
Seagull with Chinese GPS | సీగల్‌కు చైనా జీపీఎస్ ట్రాకర్.. నేవీ బేస్ సమీపంలో కనిపించడంతో కలకలం
Ghaziabad Woman Murder | ఇంటి కిరాయి అడిగిన ఓనర్.. హత్య చేసి సూట్‌కేసులో కుక్కిన దంపతులు
Man Kills Parents, Cuts Bodies | తల్లిదండ్రులను చంపి, మృతదేహాలను నరికి.. నదిలో పడేసిన కొడుకు