బెంగళూరు: వలస పక్షి సీగల్‌కు చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్నది. భారత నౌకాదళం బేస్ సమీపంలో ఇది కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపింది. సీగల్‌కు ఉన్న చైనా జీపీఎస్ ట్రాకర్ గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (Seagull with Chinese GPS) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కార్వార్ తీరంలో ఐఎన్ఎస్ కదంబ నావికా స్థావరం ఉన్నది. ఈ నేవల్ బేస్ సమీపంలోని తిమ్మక్క గార్డెన్ సమీపంలో సీగల్ పక్షి కనిపించింది. దానికి చైనా జీపీఎస్ ట్రాకర్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. అటవీ శాఖలోని మెరైన్ డివిజన్‌కు సమాచారం ఇచ్చారు.
కాగా, ఆ విభాగం అధికారులు అక్కడకు చేరుకున్నారు. చైనా జీపీఎస్ ట్రాకర్‌తో ఉన్న సీగల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చైనాకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌కు చెందిన ట్రాకర్‌గా గుర్తించారు.
మరోవైపు ఆ ట్రాకర్ డేటాను అధికారులు పరిశీలించారు. కర్ణాటక తీరానికి చేరే ముందు ఆర్కిటిక్ ప్రాంతాలతో సహా 10,000 కిలోమీటర్లకు పైగా ఆ సీగల్ ప్రయాణించినట్లు తెలుసుకున్నారు. అయితే వలస పక్షులపై స్టడీ కోసమా లేక గూఢచర్యం కోసమా అన్నది తెలుసుకునేందుకు చైనా జీపీఎస్ ట్రాకర్‌ను సాంకేతిక పరీక్ష కోసం పంపారు.
Also Read:
Man Kills Parents, Cuts Bodies | తల్లిదండ్రులను చంపి, మృతదేహాలను నరికి.. నదిలో పడేసిన కొడుకు
Birth Certificate Scam | ఆ గ్రామ జనాభా 1,500.. 3 నెలల్లో 27,000కుపైగా జననాలు!