లక్నో: ఇంట్లో కిరాయికి ఉంటున్న దంపతులు కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. అద్దె బకాయిలు డిమాండ్ చేసిన యజమానురాలిని వారు హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కారు. యజమానురాలి పనిమనిషి అలెర్ట్‌తో వారు అరెస్ట్ అయ్యారు. (Ghaziabad Woman Murder) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఉమేష్ శర్మ, దీప్శిఖా శర్మ భార్యాభర్తలు. రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని హౌసింగ్ సొసైటీలో వారికి రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఒక దానిలో వారు నివసిస్తున్నారు. రెండో ఫ్లాట్‌ను అజయ్ గుప్తా, ఆకృతి గుప్తా దంపతులకు అద్దెకు ఇచ్చారు.
కాగా, గత నాలుగు నెలలుగా వారు అద్దె చెల్లించడం లేదు. దీంతో టీచర్ అయిన 48 ఏళ్ల దీప్శిఖా శర్మ కిరాయికి ఉన్న దంపతులను గట్టిగా నిలదీయాలని నిర్ణయించింది. డిసెంబర్ 17న భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె ఆ ఇంటికి వెళ్లింది. అయితే దీప్శిఖా శర్మ తిరిగి రాలేదు. దీంతో ఆమె పనిమనిషి మీనా అంతటా వెతికింది.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అజయ్ గుప్తా ఇంట్లోకి వెళ్లిన దీప్శిఖా శర్మ బయటకు రాకపోవడాన్ని గమనించారు. దీంతో అనుమానించిన ఆమె కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో అజయ్ గుప్తా దంపతులు పెద్ద సూట్‌కేసుతో ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆటోలో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. పనిమనిషి మీనా అనుమానించి వారిని అడ్డుకోగా ఇంట్లోకి తిరిగి వెళ్లారు.
కాగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అజయ్ గుప్తా ఉంటున్న ఇంటిని సోదా చేశారు. సూట్‌కేసులో కుక్కిన దీప్శిఖా శర్మ మృతదేహాన్ని కనుగొన్నారు. అజయ్ గుప్తా, ఆయన భార్య ఆకృతిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించారు. అద్దె కోసం వేధించడంతో కుక్కర్‌తో తలపై కొట్టి, చున్నీతో గొంతునొక్కి దీప్శిఖాను హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారని పోలీస్ అధికారి తెలిపారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Man Kills Parents, Cuts Bodies | తల్లిదండ్రులను చంపి, మృతదేహాలను నరికి.. నదిలో పడేసిన కొడుకు
Birth Certificate Scam | ఆ గ్రామ జనాభా 1,500.. 3 నెలల్లో 27,000కుపైగా జననాలు!