లక్నో: భర్త వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమె ఫిర్యాదుతో భార్యాభర్తలను కౌన్సెలింగ్‌కు పోలీసులు పిలిపించారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి అత్త కాళ్లపై పడ్డాడు. భార్యను తన ఇంటికి పంపాలని వేడుకున్నాడు. (Man Falls At Feet Of Mother-In-Law) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. మధుర జిల్లాకు చెందిన వ్యక్తికి గొండా జిల్లాలోని గ్రామానికి చెందిన మహిళతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లల్లున్నారు.
కాగా, ఆ వ్యక్తి భార్యను వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే భర్త దాడి, మానసిక వేధింపులపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17న కౌన్సెలింగ్ కోసం ఇరు వర్గాలను పోలీసులు పిలిచారు. ఈ సందర్భంగా భార్యతో కలిసి జీవిస్తానని పోలీస్ అధికారిణికి అతడు హామీ ఇచ్చారు. మరోసారి కౌన్సిలింగ్‌కు రావాలని పోలీసులు వారికి చెప్పారు.
మరోవైపు కౌన్సెలింగ్ తర్వాత పోలీస్ స్టేషన్ బయట భార్యను తన ఇంటికి పంపాలని అత్తను ఆ వ్యక్తి వేడుకున్నాడు. ఆమె కాళ్లపై పడి ప్రాథేయపడ్డాడు. అత్త ఒప్పుకోకపోవడంతో ఆమె కాళ్లు విడిచిపెట్టలేదు. చివరకు పోలీసుల జోక్యంతో అత్త కాళ్లు విడిచిపెట్టాడు. అయితే అత్తమామలే తన భార్యను రెచ్చగొడుతున్నారని అతడు ఆరోపించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मेरी पत्नी वापस कर दो सास के सामने रोने लगा युवक, ससुराल छोड़कर मायके रह रही पत्नी के लिए पैर पकड़कर लगता रहा गुहार लेकिन नही मानी सास.!
अलीगढ, पुलिसलाइंस 📍 pic.twitter.com/Jt1xyQKJKY
— Gaurav kushwaha Journalist (@upwalegaurav) December 17, 2025
Also Read:
Teen Raped and Blackmailed | కాలేజీ యువతిపై అత్యాచారం, బ్లాక్మెయిల్.. ముగ్గురు అరెస్ట్
Ghaziabad Woman Murder | ఇంటి కిరాయి అడిగిన ఓనర్.. హత్య చేసి సూట్‌కేసులో కుక్కిన దంపతులు
Man Kills Parents, Cuts Bodies | తల్లిదండ్రులను చంపి, మృతదేహాలను నరికి.. నదిలో పడేసిన కొడుకు
Seagull with Chinese GPS | సీగల్‌కు చైనా జీపీఎస్ ట్రాకర్.. నేవీ బేస్ సమీపంలో కనిపించడంతో కలకలం