Kiren Rijiju | వక్ఫ్స్ (సవరణ) బిల్లు 2024ను కేంద్రం గురువారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వక్ఫ్ ఆస్తులను నియంత్రించే అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకు దఖలుపరిచే విధంగా సవరణలు ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా మహిళలతోపాటు, ముస్లిమేతరులకు వక్ఫ్బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పించే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లును విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee)కి పంపేందుకు అంగీకరించింది.
ఈ నేపథ్యంలో తాజాగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు 21 మంది లోక్సభ ఎంపీల పేర్లను కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఇవాళ లోక్సభకు తెలియజేశారు. జేపీసీ సభ్యులుగా జగదాంబికా పాల్, నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, దిలీప్ సైకియా, అభిజిత్ గంగోపాధ్యాయ, డీకే అరుణ, గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొహమ్మద్ జావేద్, మౌలానా మొహిబుల్లా నాద్వి, కళ్యాణ్ బెనర్జీ, ఎ రాజా, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, దిలేశ్వర్ కమైత్, అరవింద్ సావంత్, సురేష్ గోపీనాథ్, నరేష్ గణపత్, అరుణ్ భారతి, అసదుద్దీన్ ఒవైసీ పేర్లను ప్రతిపాదించారు. అదేవిధంగా జేపీసీ కోసం 10 మంది సభ్యుల పేర్లను సిఫార్సు చేయాలని రాజ్యసభను కోరారు. కేంద్ర ప్రతిపాదనను లోక్సభ ఆమోదించింది.
Waqf (Amendment) Bill, 2024 | List of 21 MPs from Lok Sabha who will be members of the Joint Parliamentary Committee (JPC), names of 10 Members from Rajya Sabha to be proposed soon. pic.twitter.com/IZTNlrRv0e
— ANI (@ANI) August 9, 2024
21 MPs from Lok Sabha who will be members of the JPC are – Jagdambika Pal, Nishikant Dubey, Tejasvi Surya, Aparajita Sarangi, Sanjay Jaiswal, Dilip Saikia, Abhijit Gangopadhyay, DK Aruna, Gaurav Gogoi, Imran Masood, Mohammad Jawed, Maulana Mohibullah Nadvi, Kalyan Banerjee, A… https://t.co/CFOYj0tjY6
— ANI (@ANI) August 9, 2024
Also Read..
Atishi | మనీశ్ సిసోడియాకు బెయిల్.. నిజం గెలిచిందంటూ భావోద్వేగానికి గురైన మంత్రి అతిషీ