Jaya Bachchan | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఇక ఈ సమావేశాల్లో ఎగువ సభ ( Rajya Sabha)లో జయా బచ్చన్ (Jaya Bachchan) అంశం హాట్ టాపిక్‌గా మారింది. సభలో ‘జయా అమితాబ్ బచ్చన్’ (Jaya Amitabh Bachchan) అని పిలవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎగువ సభలో ఇప్పటికే రెండు సార్లు ఈ అంశంపై జయా బచ్చన్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమెను చైర్మన్ అలా పిలవడాన్ని వ్యతిరేకించారు.
అయితే, ఇవాళ కూడా మరోసారి ‘జయా అమితాబ్ బచ్చన్’ పేరు రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) సభలో ‘జయా అమితాబ్ బచ్చన్’ అని సంబోధించారు. దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే తన సీటులో నుంచి లేచి ఈ అంశంపై చైర్మన్ తనకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జయా బచ్చన్‌కు తోటి సభ్యులు అండగా నిలిచారు. ఈ మేరకు చైర్మన్ తీరుకు నిరసనగా సోనియా గాంధీ సహా విపక్ష కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు (Opposition Walkout).
కాగా, గత నెల 29వ తేదీన సోమవారం చైర్లో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్.. జయా బచ్చన్‌ను మాట్లాడాలని కోరుతూ.. శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ అని పిలిచారు. ఆ సమయంలో మాట్లాడేందుకు లేచిన జయా బచ్చన్ కొంత ఆవేశానికి గురయ్యారు. సర్, కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని జయా బచ్చన్ అన్నారు. అయితే, పార్లమెంట్ రికార్డుల్లో పూర్తి పేరు రాసి ఉందని, అందుకే జయా అమితాబ్ బచ్చన్ అని పిలువాల్సి వచ్చిందని డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. ఇది చాలా కొత్తగా ఉందని, భర్త పేరుతోనే మహిళకు గుర్తింపు వస్తుందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు స్వంతంగా ఉనికి లేదా వాళ్లు స్వంతంగా ఏమీ సాధించలేరా అని బచ్చన్ అడిగారు.
ఆ తర్వాత ఆగస్టు 3వ తేదీన కూడా సభలో జయా అమితాబ్ బచ్చన్ అంశం హైలైట్ అయ్యింది. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో అమితాబ్ పేరును జయా బచ్చన్ ప్రస్తావించారు. స్పీకర్ స్థానంలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) కూర్చున్న సమయంలో జయా బచ్చన్ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్ బచ్చన్‌గా పరిచయం చేసుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిసశాయి. జయా మాటలు వినగానే జగదీప్ ధన్‌ఖడ్ అయితే పగలబడి నవ్వారు.
Also Read..
Raghav Chadha | పిల్లలూ మీ మనీశ్ అంకుల్ వచ్చేస్తున్నారు.. సిసోడియాకు బెయిల్ రావడంపై రాఘవ్ చద్దా