Raghav Chadha | పిల్లలూ మీ మనీశ్ అంకుల్ వచ్చేస్తున్నారు.. సిసోడియాకు బెయిల్ రావడంపై రాఘవ్ చద్దా
Raghav Chadha | ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత (AAP leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు బెయిల్ రావడంపై ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha) స్పందించారు. ఢిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించడంతో దేశం మొత్తం సంతోషంగా ఉందన్నారు.
Raghav Chadha | ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత (AAP leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు (Supreme Court) మంజూరు చేసింది. సుప్రీం తీర్పుతో 17 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న సిసోడియాకు భారీ ఊరట లభించినట్లైంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. చివరికి సత్యమే గెలిచింది అంటూ ఆప్ నేతలు సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు.
సిసోడియాకు బెయిల్ రావడంపై ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha) తాజాగా స్పందించారు. ఢిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించడంతో దేశం మొత్తం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఢిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో దేశం మొత్తం సంతోషంగా ఉంది. సుప్రీంకోర్టుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనీశ్ జీని 530 రోజుల పాటు కటకటాలపాలు చేశారు. పేదల పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడమే ఆయన చేసిన నేరం. పిల్లలూ.. మీ మనీశ్ అంకుల్ తిరిగి వచ్చేస్తున్నారు’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
दिल्ली शिक्षा क्रांति के नायक मनीष सिसोदिया जी को बेल मिलने से पूरे देश में आज ख़ुशी है। मैं माननीय सुप्रीम कोर्ट का हृदय की गहराई से आभार व्यक्त करता हूँ।
मनीष जी को 530 दिन तक जेल की सलाख़ों के पीछे रखा गया। उनका जुर्म इतना था कि उन्होंने गरीबों के बच्चों को एक बेहतर भविष्य… pic.twitter.com/Mai1Zqi6XU
— Raghav Chadha (@raghav_chadha) August 9, 2024
నూతన మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాను పలుమార్లు విచారించిన సీబీఐ.. 2023, ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆయన జైలు జీవితాన్నే గడుపుతున్నారు. విచారణ సమయంలో సీఎం పదవిని ఆశజూపి ఆప్‌ను లొంగదీసుకొనేందుకు బీజేపీ కుట్రకు తెర తీసిందని అరెస్టుకు ముందు సిసోడియా ఆరోపించారు. ఆప్‌ను వీడాలని సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేశారని 2022 అక్టోబర్ 17న సిసోడియా తెలిపారు. బీజేపీలోకి వస్తే, ఢిల్లీ సీఎం పోస్టు ఇస్తామని ఆఫర్ చేశారని, లేకుంటే జైలుకు పంపిస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఏడాదికి పైగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నా, బీజేపీ బెదిరింపులకు వెరవకుండా సిసోడియా కోర్టుల్లో తన పోరాటాన్ని కొనసాగించారు. ఆ పోరాట ఫలితమే ఇవాళ సుప్రీం తీర్పు అని ఆప్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read..
Manish Sisodia | సిసోడియాకు బెయిల్.. 17 నెలల తర్వాత భారీ ఊరట
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

