Har Ghar Tiranga | హర్ ఘర్ తిరంగాను గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుకుందాం.. దేశ ప్రజలకు మోదీ పిలుపు
Har Ghar Tiranga | ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది.
Har Ghar Tiranga | ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) పేరిట బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని జాతీయ పండగగా నిర్వహించాలని జులైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి.. ఆ చిత్రాన్ని హర్‌తిరంగా.కామ్ వెబ్సైట్లో పోస్ట్ చేయాలని సూచించారు.
ఇందులో భాగంగానే స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్నందున ‘హర్‌ఘర్‌తిరంగా’ను (Har Ghar Tiranga) గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుకుందామని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అందరూ త్రివర్ణ పతాకాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ పెట్టారు.
‘ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో హర్ఘర్తిరంగాని మరపురాని ప్రజా ఉద్యమంగా మారుద్దాం. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేసి ఈ ఉద్యమంలో నాతో చేరాలని మీ అందరినీ కోరుతున్నాను. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను హర్‌ఘర్‌తిరంగా.కామ్ (https://hargartiranga.com)లో షేర్ చేయండి’ అంటూ మోదీ పిలుపునిచ్చారు.
As this year’s Independence Day approaches, let’s again make #HarGharTiranga a memorable mass movement. I am changing my profile picture and I urge you all to join me in celebrating our Tricolour by doing the same. And yes, do share your selfies on https://t.co/0CtV8SCePz
— Narendra Modi (@narendramodi) August 9, 2024
Also Read..
Earthquake | సిక్కింలో భూకంపం.. ఇండ్ల నుంచి జనం పరుగులు
Bihar | యూట్యూబ్ చూసి బాంబు తయారుచేసిన పిల్లలు.. పేలడంతో ఐదుగురికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

