Earthquake | సిక్కింలో భూకంపం.. ఇండ్ల నుంచి జనం పరుగులు
సిక్కింలో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 6.57 గంటలకు సోరెంగ్‌లో (Soreng) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
న్యూఢిల్లీ: సిక్కింలో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 6.57 గంటలకు సోరెంగ్‌లో (Soreng) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నెల 6న మణిపూర్, మేఘాలయలో భూమి కంపించింది. వాటి తీవ్రత 3.1, 2.9గా నమోదయింది. అదేరోజున అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
కాగా, గురువారం జపాన్ (Japan)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. నైరుతి దీవులైన క్యుషు, షికోకును శక్తివంతమైన భూకంపం వణికించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.1గా నమోదైంది. భూకంపం ధాటికి భారీ భవంతులు ఊగిపోయాయి. ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాలకు సునామీ (tsunami) హెచ్చరికలు చేశారు. మియాజాకి, కొచ్చి, ఓయిటా, కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్లకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక క్యుషులోని మియాజాకి ప్రిఫెక్చర్లో ఇప్పటికే 20 సెంటీమీటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడ్డాయి.
An earthquake of magnitude 4.4 on the Richter Scale occurred today at 06:57 IST in Soreng, Sikkim: National Center for Seismology pic.twitter.com/EWi8YnlXSK
— ANI (@ANI) August 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Manipur
- Meghalaya
- NCS
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

