Gujarat teacher | 10 ఏళ్లుగా యూఎస్‌లో శాశ్వత నివాసం.. అయినా, పాఠశాల టీచర్‌గా జీతం అందుకుంటున్న గుజరాత్ మహిళ
Gujarat teacher | గుజరాత్ రాష్ట్రానికి (Gujarat teacher) చెందిన ఓ మహిళ గత 10 ఏళ్లుగా అగ్రరాజ్యం అమెరికాలోనే ఉంటోంది. అమెరికాలో ఉన్నప్పటికీ గుజరాత్ రాష్ట్రంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిగా జీతం మాత్రం అందుకుంటున్నారు.
Gujarat teacher | గుజరాత్ రాష్ట్రానికి (Gujarat teacher) చెందిన ఓ మహిళ గత 10 ఏళ్లుగా అగ్రరాజ్యం అమెరికాలోనే ఉంటోంది. యూఎస్ గ్రీన్ కార్డుతో 2013 నుంచి చికాగో (Chicago) రాష్ట్రంలో శాశ్వత నివాసిగా ఉంటున్నారు. అయితే, అమెరికాలో ఉన్నప్పటికీ గుజరాత్ రాష్ట్రంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిగా జీతం మాత్రం అందుకుంటున్నారు.
ఇందుకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భావనాబెన్ పటేల్ (Bhavnaben Patel) అనే మహిళ గతంలో బనస్కాంతలోని అంబాజీ నగరంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండేవారు. అయితే, 2013లో ఆమె అమెరికా వెళ్లిపోయారు. యూఎస్ గ్రీన్ కార్డుతో (US green card) ప్రస్తుతం చికాగోలో శాశ్వత నివాసిగా ఉంటున్నారు.
అయితే, ఇప్పటికీ ఆమె పేరు పాఠశాల జాబితాలో (Schools Payroll) ఉంది. అంతేకాదు, పాఠశాల ద్వారా ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు. పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. పటేల్ సాధారణంగా ఏడాదికి ఒకసారి దీపావళి సందర్భంగా మాత్రం గుజరాత్‌కు వెళ్తుంటారు. ఆ సమయంలో పాఠశాలకు సెలవులు ఉంటాయి. దీంతో ఆమె పాఠశాలను సందర్శించే అవకాశం కూడా లేదు. అయినప్పటికీ ఆమె ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
‘2013లో పటేల్ అమెరికాకు మకాం మార్చారు. ఆమె పాఠశాలకు గైర్హాజరు కావడం నా దృష్టికి రావడంతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాను’ అని పాఠశాల ఇన్ఛార్జ్ టీచర్ పరుల్బెన్ తెలిపారు. ఇక దాదాపు రెండేళ్లుగా పటేల్‌ను చూడలేదని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పటేల్ చివరిసారిగా జనవరి 2023లో పాఠశాలను సందర్శించినట్లు గుర్తించారు. ఇక ఈ ఏడాది ఆరంభం నుంచి వేతనం లేని సెలవుల్లో ఉన్నట్లు ప్రాథమిక విద్యా శాఖ అధికారి ధృవీకరించారు.
Also Read..
Raghav Chadha | పిల్లలూ మీ మనీశ్ అంకుల్ వచ్చేస్తున్నారు.. సిసోడియాకు బెయిల్ రావడంపై రాఘవ్ చద్దా
Manish Sisodia | సిసోడియాకు బెయిల్.. 17 నెలల తర్వాత భారీ ఊరట
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

