జైపూర్: మంత్రులున్న ప్రముఖ హోటల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. (Bomb Threat) దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేశారు. మంత్రులతోపాటు గెస్ట్‌లను ఆయా హోటల్స్ నుంచి ఖాళీ చేయించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం ప్రముఖ హోటల్స్ హాలిడే ఇన్, రాఫెల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. హాలిడే ఇన్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బేధమ్, రాజస్థాన్ మంత్రులు కేకే విష్ణోయ్, గౌతమ్ డాక్ పాల్గొన్నారు.
కాగా, బాంబు బెదిరింపు విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆయా హోటల్స్‌కు చేరుకున్నారు. మంత్రులకు ఈ విషయం చెప్పారు. దీంతో కార్యక్రమం మధ్యలోనే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గెస్ట్‌లను కూడా పోలీసులు ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది ఆ రెండు హోటల్స్‌ను తనిఖీ చేశారు. శుక్రవారం జైపూర్ మెట్రో కోర్టు, ఫ్యామిలీ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత ఈ సంఘటన జరుగడం కలకలం రేపింది.
Also Read: