Bomb threat : పాఠశాలలో బాంబు పెట్టామని, మధ్యాహ్నం 2 గంటలకు ఆ బాంబు పేలుతుందని ఓ ఆగంతకుడు పంపిన మెయిల్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్‌తో ఆ పాఠశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వడోదరలోని సామా ఏరియాలోగల నవరచన పాఠశాలకు సోమవారం ఉదయం 6.50 గంటలకు బెదిరింపు మెయిల్ వచ్చింది. పాఠశాలలో బాంబు పెట్టామని, ఆ బాంబు మధ్యాహ్నం 2 గంటలకు పేలుతుందని ఆ మెయిల్లో ఉంది. దాంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు.
కాగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వడోదర డీసీపీ పన్నా మోమయా తెలిపారు. బెదిరింపు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది..? ఏ ఐపీ అడ్రస్ నుంచి ఆ ఈ మెయిల్ పంపారు..? అనే కోణంలో తమ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
#WATCH | Vadodara, Gujarat: Navrachana School, located in the Sama area of Vadodara, received an email regarding the bomb threat this morning. pic.twitter.com/ZYtxRbg1wx
— ANI (@ANI) June 23, 2025