Mid-air Miracle : విమానం (Flight) ఏకంగా 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. సరిగ్గా అప్పుడే ఓ గర్భిణి (Pregnant) కి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఫ్లైట్ సిబ్బంది అవసరమైన చర్యలు చేపడుతుండగానే ఆమె పండంటి మగబిడ్డ (Baby boy) కు జన్మనిచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం మస్కట్ (Muscut) నుంచి ముంబై (Mumbai) కి వస్తుండగా గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ 29 ఏళ్ల మహిళ గురువారం తెల్లవారుజామున మస్కట్ నుంచి ముంబైకి బయదేరిన విమానం ఎక్కింది. విమానం ఏకంగా 35 వేల అడుగుల ఎత్తులో వెళ్తుండగా గర్భిణి అయిన ఆ థాయ్ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దాంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ నర్సు సాయంతో ప్రసవం చేయించారు.
తల్లీబిడ్డ గోప్యతను కాపాడేందుకు ప్రయాణికులను సీట్లు మారుస్తుండగానే ప్రసవం జరిగింది. డెలివరీ సమయంలో కొందరు ప్రయాణికుల చేతిలో ఫోన్లు ఉండగా.. ఫ్లైట్ సిబ్బంది వాటిని పక్కకు పెట్టించారు. గురువారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ప్రసవం జరిగిందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది తెలిపారు. మహిళ డెలివరీ విషయాన్ని విమాన పైలెట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేశారు.
విమానం గురువారం ఉదయం 4:02 గంటలకు ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది తల్లీబిడ్డను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమెకు సహాయంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఒక మహిళా ఉద్యోగి కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఇదిలావుంటే మహిళ, ఆమె బిడ్డ థాయిలాండ్‌కు వెళ్లేందుకు అవసరమైన సాయం అందించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముంబైలోని థాయిలాండ్ కాన్సులేట్ జనరల్‌తో సంప్రదింపులు జరిపింది.
ఎందుకంటే విమానంలో ప్రసవించిన థాయ్ మహిళకు భారతదేశ వీసా లేదు. అదేరాత్రి ఆమె బ్యాంకాక్‌కు వెళ్లే కనెక్టింగ్ విమానంలో బయలుదేరాల్సి ఉంది. డెలివరీ కారణంగా ఆస్పత్రిలో చేరడంతో అది సాధ్యపడలేదు. దాంతో సంబంధిత ఫార్మాలిటీస్ కోసం ఎయిర్ ఇండియా థాయిలాండ్ కాన్సులేట్ జనరల్‌తో సంప్రదింపులు చేసింది.