న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాల్లో భారత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచిందని గ్లోబల్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ అష్లే మాడిసన్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఈ విషయంలో మెట్రో నగరాలను చిన్న నగరాలు అధిగమించాయి.
ఆశ్చర్యకరంగా 2024లో 17వ స్థానంలో ఉన్న కాంచీపురం తాజా ర్యాకింగ్స్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. కొత్త యూజర్ల రిజిస్ట్రేషన్లు, ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్న విధానం, వెచ్చిస్తున్న సమయం, సహచర్య స్థాయిలు ప్రస్తుతం కొనసాగుతున్న వివాహేతర సంబంధాలకు సూచికగా నిలిచాయన్నారు.