Turkish Airlines | రన్నింగ్ ఫ్లైట్‌లో ప్రయాణికుడి మృతి.. మాయమైన డెడ్ బాడీ..!
Turkish Airlines | విమానం రన్నింగ్‌లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. విమానం ల్యాండయిన తర్వాత అతడి మృతదేహం మాత్రం కనిపించలేదు.
Turkish Airlines : విమానం రన్నింగ్‌లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. విమానం ల్యాండయిన తర్వాత అతడి మృతదేహం మాత్రం కనిపించలేదు. ఇస్తాంబుల్ (Istamble) నుంచి శాన్ఫ్రాన్సిస్కో (San francisco) కు వెళుతున్న తుర్కిష్ ఎయిర్‌లైన్స్ (Turkish Airlines) విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… తుర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన టీకే79 విమానం ఈ నెల 13న ఇస్తాంబుల్ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఆ విమానాన్ని ఐస్లాండ్లోని కెఫ్లావిక్ ఎయిర్‌పోర్టుకు మళ్లించాలని ముందుగా భావించారు. కానీ వీలుపడకపోవడంతో షికాగో విమానాశ్రయానికి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
మృతదేహాన్ని కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించినట్లు సంబంధిత ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కానీ, తుర్కిష్ ఎయిర్‌లైన్స్ నుంచి తమకు ఎలాంటి మృతదేహం అందలేదని ఎగ్జామినర్ కార్యాలయ ప్రతినిధి నటాలియా డెరెవ్యానీ చెబుతున్నారు. దాంతో విమానం ల్యాండింగ్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Read More >>
శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు
రోజుకు 7వేల అడుగులతో డిమెన్షియా, డయాబెటిస్‌కు చెక్
వివాహేతర సంబంధాల్లో ఆరో స్థానంలో భారత్.. ఆష్లే మాడిసన్ నివేదిక వెల్లడి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

