Amit Shah | ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ‘భారమైన హృదయంతో పెహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం’ అని షా తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు మృతులకు నివాళులర్పిస్తున్న ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు.
With a heavy heart, paid last respects to the deceased of the Pahalgam terror attack. Bharat will not bend to terror. The culprits of this dastardly terror attack will not be spared. pic.twitter.com/bFxb2nDT4H
— Amit Shah (@AmitShah) April 23, 2025
ఇవాళ ఉదయం శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా.. పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) మృతులకు నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని పరామర్శించి ఓదార్చారు. వారి వేదనను విన్నారు. ఈ సందర్భంగా తమ ఆప్తులను కోల్పోయిన వారు కేంద్ర మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్ర కోసం వస్తే మావాళ్లను పొట్టన పెట్టుకున్నారంటూ రోదించారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంగళవారం మధ్యాహ్నం సమయంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ఈ దాడిలో సుమారు 28 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also Read..
Lashkar commander | పెహల్గామ్ నరమేధానికి ప్రధాన సూత్రధారి ఇతనే..!
Pahalgam | నరమేధానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఫొటో రిలీజ్.. బట్టబయలైన పాక్ కుట్ర..!