Lashkar commander | పెహల్గామ్ నరమేధానికి ప్రధాన సూత్రధారి ఇతనే..!
Lashkar commander | జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ (Lashkar commander) హస్తం ఉన్నట్లు తెలిసింది.
Lashkar commander | జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ (Lashkar commander) హస్తం ఉన్నట్లు తెలిసింది. ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్‌ను గుర్తించారు. ఉగ్రదాడికి అతడే ప్లాన్ చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఖలీద్‌ను కరుడుగట్టిన ఉగ్రవాదిగా ఎన్ఐఏ పేర్కొంటోంది. ప్రస్తుతం అతడు ఇస్లామాబాద్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు చేపడుతున్నట్లు సమాచారం. ఐఎస్ఐ, పాక్ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఖలీద్‌తోపాటు ఈ దాడికి ప్లాన్ చేసిన వారిలో పీవోకేకి చెందిన ఇద్దరు వ్యక్తులు హస్తం ఉందని నిఘా సంస్థలు గుర్తించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
మంగళవారం మధ్యాహ్నం సమయంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ఈ దాడిలో సుమారు 28 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మరోవైపు ఉగ్రదాడి ఘటన ప్రాంతానికి చేరుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. మరోవైపు ఈ నరమేధానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఫొటోను భద్రతా సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో ముగ్గురి పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. ఆసిఫ్ ఫౌజీ పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్‌గా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఈ నలుగురు పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఈ నలుగురిలో ఇద్దరు విదేశీలుగా భావిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఉండటంతో.. ఈ దాడి వెనుక పాక్ కుట్ర ఉన్నట్లు బట్టబయలైంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఎన్ఐఏ బృందం ముష్కరులు వాడిన భాష, ఇతర వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించారు. టెర్రరిస్టులు దాడి సమయంలో పష్తూన్ భాషలో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ నలుగురు ముష్కరులు మరో ముగ్గురు స్థానికులు సహకరించినట్లు తేలింది.
Also Read..
Pahalgam | నరమేధానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఫొటో రిలీజ్.. బట్టబయలైన పాక్ కుట్ర..!
Terrorists | పెహల్గామ్ ఉగ్ర దాడి.. ముష్కరుల ఊహా చిత్రాలను రిలీజ్ చేసిన ఏజెన్సీలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

