Terrorists | కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ఈ దాడిలో సుమారు 28 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు.
దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా సంస్థలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు ముష్కరుల ఊహా చిత్రాలను (Sketches Of 3 Terrorists) ఏజెన్సీలు తాజాగా రిలీజ్ చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశాయి. మరోవైపు కశ్మీర్ లోయను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ సందర్శించారు. ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్‌లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఘటన ప్రాంతాన్ని కూడా సందర్శించారు. ఇక బాధిత కుటుంబాలకు జమ్ము కశ్మీర్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున సాయం ప్రకటించింది.
Also Read..
Pahalgam Terror Attack | భూతల స్వర్గం కశ్మీర్ యాత్ర.. ఆ మూడు జంటలకు తీరని శాపం..
Terrorist | పెహల్గామ్ ఘటన.. ఏకే 47 తుపాకీతో ఉగ్రవాది తొలి ఫొటో