Terrorist | కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 26 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో టూరిస్ట్‌లపై కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫొటో తాజాగా బయటకు వచ్చింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాది ఏకే 47 తుపాకీ పట్టుకుని పరిగెత్తుతున్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ దాడిలో సుమారు పది మంది దాకా ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాల్పులు అనంతరం వారంతా సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లు తెలిసింది. వారి కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు.
మరోవైపు కశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరోసారి అక్కడ దాడులు జరగొచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను మోహరించారు. అంతేకాదు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కశ్మీర్ లోయలో భయాందోళన వాతావరణం నెలకొంది. విహార యాత్ర కోసం వెళ్లిన టూరిస్ట్‌లు హుటాహుటిన ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. ఇటీవలే భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలు రహదారులను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో టూరిస్ట్‌లు విమాన, రైలు మార్గాలను అనుసరిస్తున్నారు. ఎక్కువగా విమానాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతా శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు తరలివెళ్తున్నారు. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. పర్యాటకుల రద్దీ దృష్ట్యా పలు విమానయాన సంస్థలు ప్రత్యేక విమానాలను నడుతున్నట్లు ప్రకటించాయి.
కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతనాగ్ జిల్లా పెహల్గామ్ పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీశ్ రంజన్, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.
Also Read..
Terrorist | ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న నటి ఫ్యామిలీ.. కొన్ని గంటల ముందే కశ్మీర్‌ను వీడి..